ఎంత మోసం.. అధిక లాభాలు వస్తాయన్నాడు.. కానీ చివరికి..?

praveen
ఈ మధ్యకాలంలో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఘటనలు  రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఏదో ఒక విధంగా బురిడీ కొట్టించి భారీగా డబ్బులు దండుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఎంతోమంది. సవ్యంగా  ఉద్యోగం వ్యాపారం చేసుకుని వచ్చిన డబ్బులు సరిపోక కొత్త అవతారం ఎత్తుతున్నారు. జనాలను బురిడీ కొట్టించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ కంపెనీలో పెట్టుబడి పెడితే కళ్లుచెదిరే లాభాలు వస్తాయి అంటూ అందరినీ నమ్మించడం మొదలుపెట్టాడు ఇక్కడొక పంజాబీ వాసి. ఎంతోమంది అతని మాటలు నమ్మి పెట్టుబడులు కూడా పెట్టారు.



 కానీ చివరికి పెట్టుబడి పెట్టిన వాళ్లందరినీ నట్టేట ముంచేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్బి కాలనీలో వెలుగులోకి వచ్చింది. ఈసీఐఎల్ కు చెందిన మార్లిన్ జేవియర్ అనే పంజాబ్ కి  చెందిన వ్యక్తి.. ట్రాన్స్ ఫ్లెక్స్ టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ కంపెనీలో పెట్టుబడులు పెడితే కళ్లుచెదిరే లాభాలు పొందవచ్చు అంటూ .. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సేల్స్ మెన్లు నియమించుకొని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే అతని మాటలు నమ్మిన ఎంతోమంది పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఆ కంపెనీ అకౌంట్కి నగదు జమ చేశారు.



 ఇక ఆ తర్వాత కంపెనీకి సంబంధించిన అకౌంట్ బ్లాక్ అయినట్లు గుర్తించారు పెట్టుబడిదారులు. ఈ విషయాన్ని  ప్రశ్నించగా కేవైసీ సమస్య ఉంది అని సమాధానం దాటవేశారు. ఇక ఆ తర్వాత ఇదే తీరు కొనసాగడంతో మళ్లీ ప్రశ్నించగా 8వేల రూపాయల చెక్కు ఇచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు. తర్వాత ఫోన్ స్విచాఫ్.  దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని మార్లిన్ జేవియర్  ను అరెస్టు చేసి విచారించడంతో అసలు నిజం బయటపడింది. సీఈఓ  గా చలామణి అవుతున్న అశోక్ అనే వ్యక్తి నగదు మొత్తం ఖాచేసినట్లు విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: