ఆ వైసీపీ నేతలు జగన్ ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా..?

P.Nishanth Kumar
రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అయన తీసుకున్న ఓ సంచలనాత్మక నిర్ణయం రాజధాని మార్పు.. అమరావతి నుంచి అయన విశాఖ కి రాజధానిని తరలించడం పెద్ద సంచలనమే అని చెప్పాలి.  కేంద్రంలోని పెద్దలను రాష్ట్రంలోని ప్రజలను ఒప్పించి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు ఫలిస్తుందో తెలీదు కానీ జగన్ అయితే పెద్ద సాహసమే చేశారని చెప్పాలి.. అయితే ఇప్పటికి  ఈ రాజధాని మార్పు పెండింగ్ లో ఉందని చెప్పాలి..  కొంతమంది నేతలు దీన్ని కోర్టు దృష్టికి తీసుకుపోవడంతో అమరావతి మార్పు తాత్కాలికంగా ఆగిపోయింది.

ఇదిలా ఉంటే అమరావతి నుంచి రాజధాని తరలింపు వల్ల రాష్ట్రంలోని అందరు టీడీపీ నేతలు, వైసీపీ నేతలు ఎంతో హాయిగా ఉంటున్నారు కానీ విశాఖ లోని టీడీపీ నేతలు మాత్రం ఈరోజు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలీక దినదినగండంగా గడుపుతున్నారు.. వైసీపీ అధికారంలోకి రావడం పై వారికి ఏమాత్రం అభిప్రాయ తేడాలు లేవు.. ఎందుకంటే ఒకరోజు ఒక పార్టీ లొ ఉంటుంది, ఇంకో రోజు ఇంకో పార్టీ అధికారంలో ఉంటుంది..కానీ వైసీపీ పార్టీ వచ్చి రాజధాని మార్పు చేసి తమను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందన్న భావన అయితే వారిలో ఉంది..  వీరి పరిస్థితి ఎలా ఉందంటే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది..

అమరావతి రాజధాని కావాలంటే విశాఖ కు కోపం, విశాఖ కి కావాలంటే టీడీపీ కి కోపం అన్నట్లు తయారైంది..దాంతో టీడీపీ లో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉంటుందో లేదో అని ఇతరపార్టీ లకు తరలిపోతున్నారు.. ఈ క్రమంలోనే పలువురు కీలక నేతలు వైసీపీ లోకి వెళ్లగా గంట శ్రీనివాస్ రావు కూడా వెళ్తున్నారని కొన్ని రోజులనుండి ప్రచారం జరుగుతుంది.. అయన రాక ను  మంత్రి అవంతి కి, అనకాపల్లి ఎమ్మెల్యే అమరనాథ్ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే అమరనాధ్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. గంటా వస్తే మంత్రి పదవి మాట దేవుడెరుగు, మాట చెల్లడం కూడా కష్టం అవుతుంది. పైగా అనకాపల్లి నియోజకవర్గం అంటే గంటాకు పట్టు వుంచుకున్న నియోజకవర్గం. దాంతో గంటా ను రానివ్వద్దని జగన్ పై ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి దిగారట విశాఖ వైసీపీ నేతలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: