కిలాడీ లేడి.. ఉల్లిపాయల బండితో వచ్చి.. పని కానిచ్చేస్తుంది..?

praveen
ఈ మధ్యకాలంలో దొంగల బెడద రోజురోజుకు ఎక్కువవుతోంది. అంతేకాదు దొంగతనాలు సాదాసీదాగా జరపకుండా ఎంతో వినూత్నంగా ఆలోచించి ప్రజలను బురిడీ కొట్టించేలా దొంగతనాలకు పాల్పడుతున్నారు ఈ మధ్యకాలంలో. దీంతో దొంగలను పట్టుకోవడంలో పోలీసులకు సవాల్ గా కూడా మారిపోతుంది. ఇక్కడ ఓ కిలాడీ లేడీ సినిమా రేంజ్ లో దొంగతనాలకు పాల్పడుతుంది. రిక్షాలో  ఉల్లిపాయలు వేసుకుని ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక కిలాడీ లేడీ. ఇక ఆ వుల్లిపాయలు బండి ఎక్కడైనా  ఆగిందా ఇంట్లో విలువైన సామాను స్వాహా అవుతుంది.


 ముఖ్యంగా తక్కువగా జనాలు  ఉన్న ప్రాంతాలను ఎంచుకుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇక ఇంటికి తాళాలు ఉన్నాయి అంటే చాలు ఇక అంతే ఇంట్లో అంతా సామాను మాయమైపోతుంది. ఇక ఇటీవలే గుంటూరు జిల్లాలో కూడా ఇలాంటి తరహా చోరీ జరగగా  పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు కిలాడీ లేడి ని అరెస్టు చేసి భారీ మొత్తంలో ఆమె దగ్గర నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ కిలాడి లేడి గురించి విచారణలో నిజాలు బయట పడడంతో పోలీసులు సైతం షాకయ్యారు. బాపట్ల పట్టణంలోని భీమా వారి పాలెం లో నివాసముంటున్న శివరాం ప్రసాద్ ఇంట్లో గత నెల 29వ తేదీన చోరీ జరిగింది. అందరూ శుభకార్యానికి వెళ్లిన సమయంలో పెద్ద మొత్తంలో నగదు బంగారం చోరీకి గురైంది.



 ఇంటికి తిరిగి వచ్చిన ఇంటి యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. పట్టపగలే దొంగతనాలు జరగడం అంటే పోలీసులకు సవాల్గా మారింది. దీంతో ఈ కేసును సవాల్గా తీసుకున్నారు పోలీసులు. అందరి కదలికలపై నిఘా పెట్టారు. అంతర్రాష్ట్ర దొంగ శీలం దుర్గా పై అనుమానం వచ్చినపోలీసులు  అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించింది.  దీంతో ఆమె వద్ద నుంచి 16 లక్షల నగదు నాలుగు లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: