వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా మౌనం దేనికి దారితీస్తుందో..?
ఇక ప్రభుత్వం అన్నాకా అందరిని ఎమ్మెల్యేలను మెప్పించడం చాలా కష్టం.. చాల సమీకరణాల దృష్ట్యా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం, వారికి తగ్గ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడినా వారిలో కొంతమందికి అనుకున్న పదవులు, ఉన్నత స్థానాన్ని కల్పించడం కుదరకపోవచ్చు.. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన మంత్రి వర్గ విస్తరణం ను రెండు భాగాలుగా చీల్చి రెండున్నరేళ్ళకోసారి మంత్రి వర్గ విస్తరణ చేయాలనీ నిర్ణయించారు.. ఈ నేపథ్యంలో మొదటి మంత్రి వర్గ విస్తరణలో చాలామంది కి మొండి చేయి చూపాల్సి వచ్చింది.. రోజా వంటి కీలక మైన మహిళా నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండానే జగన్ సరిపుచ్చాడు..
అయితే జగన్ ఏది చెప్పినా, చేసినా సరే అనే రోజా ఇప్పుడు జగన్ పై కొంత అసహనానికి గురవుతుందని వార్తలు వస్తున్నాయి.టీడీపీ నుంచి వైసీపీ లో చేరినా జగన్ కు అత్యంత నమ్మకమైన నేతగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ కు ఒకరకంగా కుడిభుజంగా వ్యవహరించారనే చెప్పాలి. అసెంబ్లీలోనూ రోజా అప్పటి అధికార పార్టీపై విరుచుకుపడటంతో ఏడాది పాటు సస్పెండ్ కు కూడా గురయ్యారు.అలాంటి రోజాకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కష్టాలు ఎక్కువయ్యాయంటున్నారు. నగరి నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకుండా చేస్తుండటం ఆమెకు మింగుడపడటం లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటపడినా ప్రయోజనం లేదని సన్నిహితులు వారించడంతో రోజా మౌనం వహిస్తున్నారని చెబుతున్నారు. జగన్ కు తెలిసే అంతా జరుగుతుందని భావించిన రోజా సమయం కోసం వెయిట్ చేస్తున్నారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద రోజా మౌనం వీడితే ఏం జరుగుతుందో చూడాలి.