చీకట్లో బాణం వేస్తున్న అచ్చెం నాయుడు.. కొత్త ఉత్సాహం తెచ్చేనా.?
జైలునుంచి వచ్చిన అచ్చెం నాయుడు కి చంద్రబాబు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు.. ఇటీవలే ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా నియమించి పార్టీ ని బలోపేతం చేయాలని చెప్పగా ఆ పనిలోనే అయన నిమగ్నమైపోయారు.. అచ్చెం నాయుడు రాకతో టీడీపీకి కొత్త ఊపు వచ్చిందని చెప్పేందుకు తనదైన హావాభావాలతో అచ్చెం నాయుడు గాలిలో పిడగుద్దులు గుద్దుతున్నారు. ఇక టీడీపీ ఓటమికి కారణాలు వెతికి దాన్ని బలోపేతం చేయాలనీ చూస్తుండగా బీసీ లకు పార్టీ దూరం అవడమే ఘోర ఓటమికి కారణం అని విశ్లేషణలు అయన దగ్గరికి వచ్చాయట..అయితే దానినిం వైసీపీ కి వ్యతిరేకంగా మాట్లాడడంలో అయన సక్సెస్ అవుతున్నారు..
వైఎస్ జగన్ చెప్పిన మోసపు మాటలు విని కొంత మంది బీసీలు వైసీపీకి ఓటేశారని చెప్పుకొస్తున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల పథకాలు ఆగిపోవడం, అడుగడుగునా అణిచివేయడంతో మళ్లీ బీసీలు టీడీపీ వైపు చూస్తున్నారని మూసపద్ధతిలో విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి పాత చింతకాయ విధానంతో కూడిన రాజకీయాలు చేయడం వల్ల ప్రస్తుత సమయంలో ఎలాంటి ప్రయోజనం ఉండబోదనేది అందరూ చెప్పే మాట. వైసీపీ వచ్చిన తర్వాత బీసీలకు పథకాలు ఆగిపోయాయని అంటున్న అచ్చెం నాయుడు.. ఆగిపోయిన ఆ పథకాలు ఏమిటి..? వాటి వల్ల బీసీలకు వచ్చిన నష్టం ఎంత..? అనే వివరాలు చెబితే ఆయన విమర్శలను ప్రజలు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే వచ్చే ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడించే ఆలోచనలో ప్రజలు ఉన్నారు..