జగన్ తండ్రిని మించిన తనయుడు అవుతున్నాడా..?

P.Nishanth Kumar
రాష్ట్రంలో జగన్ ఎంతో సమర్దవంతం గా పాలన అందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.. మూడు రాజధానుల విషయంలో ఆయన చూపిస్తున్న దార్శనికత కి ప్రతి ఒక్కరు సమర్దిస్తున్నారు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష తో ఆయన రాజధాని తరలిస్తునారని చెప్పి ఇప్పటికే విశాఖ కు రాజధాని ని తరలించారు.. మిగితా వ్యవహారాలలో కూడా జగన్ ఎంతో సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు.. ఎక్కడా ప్రతిపక్షాల విమర్శలకు తావు ఇవ్వకుండా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని మరీ అన్ని పనులు చేసుకుపోతున్నాడు..
పథకాల అమలుల విషయంలో అయినా, రాష్ట్రంలో వచ్చిన సమస్య పరంగా జగన్ ఎంతో నేర్పు తో పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నాడు.. అయితే ఇక్కడే ప్రతిపక్షాలకు జగన్ మీద అసూయ ఏర్పడింది.. ఎక్కడ తమకు ఛాన్స్ ఇవ్వకుండా జగన్ దూసుకుపోతుండడంతో  రాష్ట్రంలో ఏదైనా సమస్య రాకపోద్దా అని గోతి కాడి నక్కల్లా వారు ఎదురుచుస్తున్నారట.. ఇదిలా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవ అలాంటిది ఇలాంటిది కాదు.. సొంత నియోజకవర్గం కన్నా ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి తెలంగాణా ను అభిమానించే వారు.. పథకాల అమలులో కూడా అయన దగ్గరుండి ప్రజలకు చేరుతున్నాయి లేదో చూసుకునేవారు.. అందుకే అక్కడి ప్రజలకు వైఎస్సార్ అన్నా కాంగ్రెస్ పార్టీ అంత ప్రేమ..
ఇక కొన్ని విషయాల్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు జగన్..వైఎస్సార్‌ తర్వాత మళ్లీ పదేళ్లకు ఆంధ్రప్రదేశ్‌ రైతులకు ఆ స్థాయిలో ప్రభుత్వం చేయూత అందిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైతే ముందు అనేలా వైఎస్సార్‌ తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. తండ్రికి తగ్గ తనయుడుగానే కాక తండ్రిని మించిన తనయుడుగా వైఎస్‌ జగన్‌ అన్నదాతలకు అండగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌ పావలా వడ్డీకే వ్యవసాయ రుణాలు అందిస్తే.. వైఎస్‌ జగన్‌ సున్నా వడ్డీకే రుణాలు అందించాలని నిర్ణయించారు. వచ్చే నెల 10వ తేదీన రాష్ట్రంలోని అన్నదాతలకు వ్యవసాయానికి వడ్డీలేని రుణాలు అందించే పథకం ప్రారంభించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: