కమలనాథులు జగన్ ని వెనుకనుండి టార్గెట్ చేస్తున్నారా..?
మసి పూసి మారేడు కాయ చేయడంలో చంద్రబాబు ను మించిన వారు లేరని చెప్పాలి.. అయితే ఇప్పుడు ఇదే వైఖరి ని ఏపీలోని బీజేపీ నేతలు ఫాలో ఆవున్నారని చెప్పొచ్చు.. ముందు జగన్ ని పొగుడుతూనే వెనుకనుంచి జగన్ ని బ్యాడ్ చేసే వ్యహాన్ని అమలు చేస్తున్నారు.. ఇతర రాష్ట్రాల లో బీజేపీ నేతలు చేయని విమర్శలు మాత్రం ఏపీలో నేతలు చేస్తున్నారు అంటే వారి రాజకీయం ఎంత పండిపోయిందో అర్థం చేసుకోవచ్చు.. జగన్ రాష్ట్రంలోని కొన్ని పథకాలకు తమ పార్టీ కి సంబందించిన పేర్లను పెట్టారు.. ఆయితే కేంద్రం పేరుతో పెట్టుకున్న పథకాలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ పేరు కూడా పెట్టాలని అంటున్నారు. దాంతో జగన్ పై వీరికి చంద్రబాబు కు లాగ అక్కసు మొదలైందని అంటున్నారు..
తాజాగా ఆయన మరో కీలక పథకాన్ని కూడా ప్రవేశ పెట్టారు. అదే జగగన్న విద్యాకానుక. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ చదివే విద్యార్థులకు రు. 650 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశారు. అయితే, ఇది బీజేపీ నేతలు కార్నర్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. ఈ సొమ్ములో ఎంత కేంద్రం ఇచ్చిందో చెప్పలేదు కానీ.. కేంద్రం డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రధాని మోడీ పేరు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. నిజానికి అదే సమయంలో ఈ పథకానికి ఎంత మేరకు నిధులు ఇచ్చారనే విషయాన్ని వెల్లడించి ఉంటే బాగుండేదని అంటున్నారు విశ్లేషకులు.