మీది ఆ బ్లడ్ గ్రూపా.. అయితే మీరు వెరీ లక్కీ...!?

Chakravarthi Kalyan
మనుషులంతా ఒక్కటే అయినా అందరిలో ప్రవహించే రక్తం మాత్రం ఒక్కటి కాదు.. అందులో ఎన్నో గ్రూపులు ఉంటాయి. ఒక్కో గ్రూపు రక్తానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఏ గ్రూపు వారికి ఆ గ్రూపు రక్తమే ఎక్కించాల్సి ఉంటుంది. అయితే మనుషుల్లోని ఈ బ్లడ్ గ్రూపులు ఎన్నో  పరిశోధనలకు అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ పరిశోధనలో O రక్త గ్రూపు కలిగిన వ్యక్తులకు కొవిడ్  సంక్రమించే అవకాశాలు తక్కువేనని తేలింది.
బడ్ల్  అడ్వాన్స్  జర్నల్ లో ప్రచురించిన ఈ అధ్యయనం ఆసక్తి రేపుతోంది. ఒకవేళ O బ్లడ్ గ్రూపు వారికి కరోనా సోకినా  ఇతర గ్రూపుతో పోల్చితే వైరస్  తీవ్రత తక్కువని ఈ అధ్యయానం స్పష్టం చేసింది.  కొవిడ్  సంక్రమించే వ్యాప్తిపై పరిశోధనల్లో భాగంగా డెన్ మార్క్ లో కరోనా సోకిన దాదాపు 4 లక్షల 70 వేల మంది హెల్త్  డేటాను తీసుకొని ఈ పరిశోధన చేశారు. .22 లక్షల మంది సాధారణ ప్రజలతో పోల్చి చూసినప్పుడు ఈ వివరాలు తెలిశాయి.
A, B, AB, రక్త గ్రూపులతో పోల్చితే O గ్రూపు వ్యక్తులు తక్కువ మంది కరోనా బారిన పడ్డారని ఈ పరిశోధనల్లో గుర్తించారు. అయితే A, B, AB వ్యత్యాసాన్ని చూడలేదని పరిశోధకులు చెబుతున్నారు. కెనడాలో జరిగిన మరో అధ్యయనంలో O, B రక్త గ్రూపులతో పోల్చితే A, AB రక్త గ్రూపు కలిగిన వారే  అధికంగా కరోనా వైరస్  బారిన పడుతున్నారని తేలిందట. ఆసుపత్రుల్లో  ఆరోగ్య పరిస్థితి విషమించిన 95మంది రోగుల డేటాను పరిశీలించిన  తర్వాత ఈ క్లారిటీకి వచ్చారట.
O, B గ్రూపుతో పోల్చితే మిగిలిన రక్త గ్రూపుల వారికి అవయవాలు దెబ్బతినడం, విఫలమయ్యే అవకాశం కూడా ఎక్కువేనట. అయితే ఈ అధ్యయనాలపై మరింత క్లారిటీ కోసం మరి కొన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని ఆయా అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. కాకపోతే ఓవరాల్‌గా ఓ అవగాహన కోసం ఈ ఫలితాలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: