కేంద్రం గుడ్ న్యూస్.. రైతులు ఇలా చేస్తే ప్రతినెల అకౌంట్లోకి 3వేలు..?
ఇక ఈ స్కీమ్ లో రైతులు చేరవచ్చు. స్కీమ్ లో చేరిన రైతులందరికీ ప్రతి నెల 3000 రూపాయలు లభిస్తాయి. అయితే రైతులకు ప్రతి నెల డబ్బులు రావడానికి రైతులు ముందుగానే చిన్న మొత్తంలో డబ్బులు జమ చేయాలి . ఒకరకంగా చెప్పాలంటే ఇది పెన్షన్ స్కీమ్ లాంటిది అని చెప్పవచ్చు. ఇక పీఎం కిసాన్ స్కీమ్ లో చేరిన వారు... ఎలాంటి డాక్యుమెంట్లు పత్రాలు అవసరం లేకుండానే కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్ లో కూడా చేరేందుకు అవకాశం ఉంటుంది. బ్యాంకుకు వెళ్లి డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రతి నెల ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అవుతూ ఉంటాయి .
ఇలా ప్రతి నెలా కొంత మొత్తంలో బ్యాంకులో డబ్బులు జమ చేయడం ద్వారా.. 60 ఏళ్ల తర్వాత రైతులు నెలకు మూడు వేల రూపాయల వరకు పొందవచ్చు. అంటే రైతులు ప్రతీ ఏడాది 36 వేల వరకూ పొందే అవకాశం. 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య వయసు ఉన్న రైతులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో అర్హులు అని చెప్పాలి. ఇక నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ ఖాతాకి అర్హులుగా ఉండే రైతులకు కేవలం ఐదు ఎకరాల లోపు పొలం ఉండాలి.