ఎస్బిఐ శుభవార్త.. అకౌంట్ లోకి 10వేలు..?

praveen
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం తమ కస్టమర్లకు  ఎన్నో మెరుగైన సర్వీసులను అందిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కరోనా వైరస్ సంక్షోభం సమయంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎంతోమంది కస్టమర్లకు చేయూతనిచ్చే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆర్థికంగా చితికి పోయిన వారికి చేయూత అందించే విధంగా పలు లోన్ లను  అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పుడు మరోసారి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చి శుభవార్త అందించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.



 ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం స్వ నిధి పథకం కింద అర్హత కలిగిన వారికి పదివేల రూపాయల లోన్ లభిస్తోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి  ఇది ఎంతగానో ఊరట కలిగించే అవకాశం ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ స్కీం లో  భాగంగా తమ కస్టమర్లను అర్హులకు లోన్ అందిస్తోంది. ఎస్బిఐ ఈ-ముద్ర ద్వారా లోన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 50 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్ లో భాగంగా పదివేల రుణం తీసుకున్న వారు మళ్ళీ ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.



 ఇక ఈ మొత్తాన్ని మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఈఎంఐ రూపంలో ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఒక ఏడాది సమయంలోగా తీసుకున్న రుణాన్ని మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి తరహా రుణాలపై కేంద్ర ప్రభుత్వం 7 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రతి నెల సరిగ్గా లోన్  ఈఎంఐ  చెల్లించే వరకు 1200 వరకు క్యాష్బ్యాక్ కూడా లభించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటి వరకు పీఎం స్వ  నిధి స్కీమ్ కింద 7.85 లక్షల రుణాలు మంజూరు కావడం గమనార్హం. ఇక ఈ లోన్ తీసుకోవాలని భావించే వారు వెంటనే https://emudra.sbi.co.in:8044/emudra లో  లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: