భారత్ కు తోడుగా మూడు దేశాలు రెడీ... కార్యాచరణ కూడా..?

praveen
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రరాజ్యాల తో సంబంధాల ను ఎంతో మెరుగు పరుచుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. వాణిజ్యపరమైన సంబంధాలను... రక్షణ పరమైన సంబంధాల ను కూడా భారత్ ఎంతో సమర్థవంతంగా మెయింటైన్ చేస్తూ పోతుంది. సరిహద్దుల్లో  చైనాతో ఉద్రిక్తతల దృశ్య.. భారత్ వెంట నడిచేందుకు అగ్ర రాజ్యాలైన జపాన్ అమెరికా ఆస్ట్రేలియా దేశాలు సిద్ధమైన విషయం తెలిసిందే. భారత్కు ఎలాంటి సహాయం కావాలి అన్న అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే నాటో తరహాలో చతుర్భుజ కూటమి ఏర్పడుతుందని ప్రపంచ వ్యాప్తంగా విశ్లేషకులు అంచనా వేశారు.




 కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన కార్యాచరణ కానీ... సమావేశం కానీ ఎక్కడా జరగలేదు... కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ నాలుగు దేశాలు కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత దేశాలు కూటమిగా ఏర్పడి వాణిజ్య పరంగా రక్షణ  పరంగా కూడా ఒకటిగా ముందుకు నడిచేందుకు ప్రస్తుతం సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే జపాన్ ఆస్ట్రేలియా అమెరికా భారత్ దేశాలకు  ముఖ్యంగా విదేశాల ప్రతినిధులు విదేశాంగ మంత్రులు కూడా ఒకే చోట సమావేశమై ఈ కూటమిపై  చర్చించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.




 ఇక నాలుగు దేశాలు కలిసి కూటమిగా ఏర్పడాలనే  ప్రతిపాదనకు  జపాన్ నాయకత్వం వహిస్తుంది. జపాన్ దేశంలోని టోక్యో వేదికగా ప్రస్తుతం అన్ని దేశాలకు సంబంధించిన విదేశాంగ ప్రతినిధులు,  విదేశాంగ మంత్రుల సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. విదేశాంగ సహాయం తో రక్షణ సాయం కూడా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక దేశం పై ఏదైనా శత్రుదేశం దాడి చేసినప్పుడు మిగతా మూడు దేశాలు కూడా ఆ దేశం తరఫున పోరాడుతాయి. ఇది ఇతర దేశాలకు ఎంత ఉపయోగమో అటు భారత్ కి కూడా అంతే ఉపయోగం అని అంటున్నారు విశ్లేషకులు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: