హాంకాంగ్, టిబెట్, బలూచ్.. మన కోసం కదిలాయి..?
ఈ క్రమంలోనే సరిహద్దుల్లో ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు కూడా సృష్టించింది. ఎన్నో విధాలుగా భారత సైనికులను భయాందోళనకు గురి చేసినందుకు ప్రయత్నించింది చైనా . ఇక చైనా చర్యలకు భారత్ ఎక్కడ వెనకడుగు వేయలేదు కదా ఏకంగా చైనాకు షాకిచ్చే వ్యూహాలతో... ముందుకు సాగుతోంది. దీంతో ప్రస్తుతం చైనా ని చూసి భారత్ కాదు... భారత్ ను చూసి చైనా వణికిపోతోంది. చైనా పై భారత్ ఒక రకంగా ఆధిపత్యం సంపాదించింది అనే చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో చైనా విస్తరణ వాద ధోరణి తో నలిగిపోతున్న ఎన్నో దేశాలు భారత్ కు అండగా నిలబడేందుకు భారత్ కు మద్దతు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఇటీవలే హాంకాంగ్ లో భారత జాతీయ పతాకాన్ని చుట్టుకొని ఒక యువకుడు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేసి భారత్ తమకు అండగా నిలబడాలంటూ కోరాడు. బెలూచిస్థాన్ లో వందేమాతరం నినాదాలు వస్తున్నాయి. గిల్జిత్ బల్జిస్థాన్ లో హిందుస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు వినిపించారు. ఇక టిబెటన్లు భారత్ అంటే సగర్వంగా నమస్కరించి మద్దతు ఇస్తున్నారు . తైవాన్ భారత్ను గౌరవించి తోడుగా నిలిచేందుకు సిద్ధమైంది. ఇలా ప్రపంచం భారత్ ను అగ్రగామిగా చూస్తోంది. చైనా ను ఎదుర్కొనగలిగే శక్తి భారత్ కు మాత్రమే ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అందుకే ప్రపంచ దేశాలు భారత్ పై ఆశలు పెంచుకుంటున్నాయి.