గుడ్ న్యూస్.. కరోనా కోసం కొత్త మందు.. అందరి ఆశలు దానిపైనే..?

praveen
దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య ఏ రేంజ్లో పెరిగిపోతుందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు రికార్డు స్థాయిలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య నమోదు అవుతున్న తరుణంలో ప్రజల్లో  తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా  వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. అదే సమయంలో అన్లాక్ లో భాగంగా అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతులు ఇస్తోన్న  నేపథ్యంలో ప్రజల రద్దీ రోజురోజుకు పెరిగి చివరికి కరోనా  కేసుల వ్యాప్తికి కారణమవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ... రికవరీ రేటు కూడా ఎక్కువగా ఉండడం అందరిలో ధైర్యాన్ని నింపుతుంది.



 ఏకంగా వృద్ధులు సైతం కరోనా  వైరస్ బారి నుంచి కోలుకుంటుండటం కాస్త ఊరట నిస్తుంది. ఇదే సమయంలో భారత్లో రికవరీ రేటును మరింతగా పెంచేందుకు ఐసీఎంఆర్ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటివరకు ఈ మహమ్మారి కరోనా వైరస్కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఐసీఎంఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలందరికీ శుభవార్త వినిపించింది.



 కరోనా నివారణ చికిత్సలో భాగంగా... ఐసీఎంఆర్ హైదరాబాద్కు చెందిన బయాలజికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తో కలిపి ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అత్యంత అధికంగా శుద్ధిచేసిన యాంటీ సిరా  అభివృద్ధి చేసింది. ప్రొఫేలాక్సిస్, కోవిడ్ -19 లక్షణాలకు కూడా ఈ యాంటీ సిరాతో చికిత్స అందించవచ్చు అని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. రేబీస్, హైపటైటిస్ బి, వ్యాక్సినా వైరస్, డిఫ్తీరియా లాంటి పలు రకాల వ్యాధులు వైరస్లకు బ్యాక్టీరియాలకు కూడా ఇదే తరహా చికిత్స అందించేందుకు యాంటీ సిరా ఉపయోగపడుతుందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో యాంటీ సిరా అందుబాటులోకి రావడం ఒక శుభపరిణామం అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: