సోము వీర్రాజు కి అంత ఫ్రీ డమ్ ఇచ్చేశారా..?

P.Nishanth Kumar
రాష్ట్రంలో బీజేపీ పార్టీ రోజు రోజు కి దిగజారిపోతున్న క్రమంలో కేంద్రంలోని బీజేపీ పార్టీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ని బలోపేతం చేయాలనీ సోము వీర్రాజు ని లైన్ లోకి దించింది. మొదట్లో కాస్త కాం గా ఉంటూ పెద్దగా ప్రజల నోట్లో నానని సోము ఆ తర్వాత తన చర్యలతో, కార్యచరణలతో పార్టీ ని కొద్ది కాలంలోనే బలోపేతం చేశారు.. దానికి ప్రజలు సైతం ఎంతో ఆశ్చర్య పోయారు.. RSS  విధానాలను ఎక్కువగా పాటించే సోము వీర్రాజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దేవాలయాల దాడుల విషయంలో చేసిన హడావుడి అంతా ఇంతాకాదు..
వరుస విమర్శలతో, దాడులతో ప్రభుత్వం సిబిఐ విచారణ వేయించేందుకు కీలక కారణమయ్యారు.. అంతేకాదు ప్రభుత్వం తీసుకుంటున్న చాలా నిర్ణయాలకు బీజేపీ పార్టీ హస్తం పరోక్షంగా ఉంది అనడం లో ఎలాంటి సందేహం లేదు..  అయితే భవిష్యత్ లో సోము ఇలాంటి నిర్ణయాలు మరిన్ని తీసుకుంటే పార్టీ ఇంకా ఇంకా బలపడడం ఖాయమని ఆయన్ని ఫ్రీ గా ఉంచడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది..ఇప్పటి వరకు బీజేపీ తరపున చక్రం తిప్పిన వారిని పక్కన పెట్టి సోము వీర్రాజుకు కావాల్సిన టీమ్‌ను ప్రిపేర్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారని చెబుతున్నారు. అదే విధంగా రాష్ట్రంలో కొద్దోగొప్పో ప్రభావం చూపుతారనుకున్న నాయకుల్ని కూడా కేంద్రకమిటీ పేరుతో అధిష్టానం తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు.
తద్వారా సోము వీర్రాజుకు ఏపీలో అడ్డంకులు ఎదురయ్యేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా ముందుచూపుతో వ్యహరించారంటున్నారు. కన్నా లక్ష్మి నారాయణ టైం లో ఉన్న లీడర్ లు ఎవరు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారం లక్ష్యం గా సాగిపోతున్న సోము వీర్రాజు ప్రాముఖ్యత పెంచితే ఇంకా ఇంకా ఉత్సాహం తో పనిచేస్తాడని వారి ఆలోచన..  నిజానికి 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు నోటాతోనే పోటీపడ్డారని రాజకీయవర్గాల్లో టాక్‌నడుస్తుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్ధుల్లో ఒక్కరిక్కూడా డిపాజిట్లు దక్కినదాఖలాల్లేవు.  ఈ సారి దానికి పూర్తి భిన్నంగా సాగిపోవాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: