నాలుగో పెళ్లి కోసం కొడుకుని చంపిన తల్లి.. కానీ చివరికి.?
వీరికి సజన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. కాని మనస్పర్థల కారణంగా పెళ్లయిన ఏడాది కాలంలోనే భార్యాభర్తలు ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత దేవి మరో పెళ్లి చేసుకుంది కానీ కొన్నాళ్ళకి భర్త అనారోగ్యంతో మరణించాడు. ఇక ఆ తర్వాత మూడో వివాహం చేసుకోగా మూడో భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అయితే ఇక ఇటీవలే నాలుగో పెళ్లి చేసుకోవాలని భావించింది సదరు మహిళ. కానీ నాలుగో పెళ్లి కి తన మొదటి భర్త కుమారుడు అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో పేగు తెంచుకుని పుట్టిన బంధాన్ని కూడా మరిచి పోయింది ఆ తల్లి.
ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారం కుమారుని దారుణంగా హత్య చేసింది తల్లి. నీటిలో ముంచి ఊపిరి ఆడకుండా చేసి అతని ప్రాణాలు తీసింది. అయితే ఆ తర్వాత రోజు నీటిలో తేలియాడుతున్న బాలుడు మృతదేహం చూసి స్థానికులు కొంత మంది పోలీసులకు సమాచారం అందించారు. స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం స్వాధీనం చేసుకొని సజన్ మృతదేహం గా నిర్ధారించాడు. దీంతో తల్లిని అదుపులోకి తీసుకొని విచారించగా... అసలు నిజాన్ని అంగీకరించింది తల్లి. దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.