తెలంగాణలో ఎన్నికల వేడి !

NAGARJUNA NAKKA
తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఒకదాని వెనక మరో ఎన్నికలు రావడంతో రాజకీయ పార్టీలు అన్నీ ఆ పనిలో పడ్డాయి. ఎవరికి వారు..తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు.

తెలంగాణ లో మళ్ళీ ఎన్నికల సెగ మొదలైంది. అధికార..ప్రతిపక్ష పార్టీల నేతలు ఎవరి వ్యూహాల్లో వారున్నారు. ఎన్నికలను అన్ని పార్టీలు ఈ సారి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ ఏ ఎన్నికలు వచ్చిన విజయం మాదే అనే ధీమాతో ఉన్నా... ప్రతిపక్షాలు ఈ సారైనా గెలిచి నిలవాలలని పావులు కదుపుతున్నాయి. ముందు దుబ్బాక ఉప ఎన్నికలు... తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇంతలో గ్రేటర్ హైదరాబాద్... ఖమ్మం.. వరంగల్ కార్పొరేషన్  ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి.

అధికార టీఆర్ ఎస్ పార్టీ కి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా... ప్రజల మద్దతు మనకే అని ధీమాతో ఉంది. ఏ ఎన్నికలు జరిగినా.. వరుసగా విజయాలు చేకూరడం కూడా అందుకు ఓ కారణం. ఇప్పటికే... గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎన్నికలకు అధికార పార్టీ సవాల్ గా తీసుకుంటుంది. ఓటర్ల నమోదు ని డ్రైవ్ లాగా చేస్తుంది. ఇక గ్రేటర్ లో ఎన్నికల్లో ఏం చేయాలన్న దానిపై...45 రోజుల షెడ్యూల్ కూడా కార్పొరేటర్లు కు ఆప్పగించింది. దుబ్బాక లో ఎన్నికల ప్రచారం ఇప్పటికే మొదలిపెట్టింది టీఆర్ఎస్.

ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమవుతుంది. దుబ్బాక ఉప ఎన్నికలకు ఇప్పటికే పరిశీలకులను పంపింది. అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కూడా కొలిక్కి వస్తోంది. ఇక గ్రేటర్ ఎన్నికలకు ఇటీవల ప్రభుత్వం... ప్రతిపక్ష సవాళ్ల పర్వం అసెంబ్లీ సాక్షిగా సాగింది. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం... వరుసగా జరుగుతున్న ప్రమాదాలు... ప్రభుత్వం వైఫల్యాలు గా నే భావిస్తుంది. వీటన్నిటిని జనాల్లో కి తీసుకెళ్లాలని చూస్తుంది. ఇక గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో విజయం మాదే అనే ధీమాతో ఉంది. నిరుద్యోగులకు   ఇస్తానని చెప్పిన ఉద్యోగాలు...నిరుద్యోగ భృతి ఏమయిందనే అంశం తమకు అనుకూలిస్తుందాన్ని లెక్కలు వేస్తోంది కాంగ్రెస్.

బీజేపీ ఎన్నికలకు ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది. అధికార టీఆరెస్ కి ధీటుగా పోటీ ఇచ్చేది బీజేపీ నే అనే ధీమాతో ఉంది. ఇక గ్రాడ్యుయేషన్ నియోజకవర్గం ఎన్నికల్లో..ఇప్పటికే హైదరాబాద్.. పాలమూరు..రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీ తనకు అనుకూల ఫలితాలే వస్తాయనే లెక్కలు వేస్తుంది. ఇక నల్గొండ, ఖమ్మం.. వరంగల్ నియోజకవర్గ ల్లో బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని చూస్తోంది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో..గతంలో ఎదుర్కొన్న ఇబ్బదులను అధిగమించి...ప్రభుత్వ వైఫల్యం... కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృది లాంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో వాడాలని చూస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: