నిండు గ్యాస్ సిలిండర్.. ఇంట్లో ఎక్కువ రోజులు ఉంచితే ఏమౌతుంది..?
ఇలాంటి నేపథ్యంలో నిండుగా ఉన్న గ్యాస్ సిలిండర్ ను ఎక్కువ రోజులు వినియోగించకుండా ఇంట్లోనే పెడితే ఏదైనా సమస్యలు వస్తాయా అనే అనుమానాలు కూడా చాలామందిలో తలెత్తుతూ ఉంటాయి. ఇక పక్క వాళ్ళను ఎవరైనా అడిగితే ఎన్నో అనుమానాలు చెబుతూ ఉంటారు. అయితే నిండు గ్యాస్ సిలిండర్ ను ఇంట్లో చాలా రోజుల వరకు అలాగే పెట్టడం ద్వారా ఎలాంటి సమస్య ఉండదా అంటే... అవుననే చెబుతున్నారు నిపుణులు. గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంచినప్పటికీ ఎలాంటి నష్టం ఉండదట.
అయితే కొన్ని విషయాలను మాత్రం వినియోగదారులు గుర్తుంచు కోవాలి అని చెబుతున్నారు నిపుణులు. ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు ఎక్కువ కాలం మన్నిక కు వస్తాయని.. దీర్ఘకాలం పాటు వాటిని అలాగే ఉంచినప్పటికీ ఎలాంటి నష్టం వాటిల్లదు అంటూ చెబుతున్నారు. కానీ గ్యాసోలిన్ డీజిల్ వంటి వాటిని మాత్రం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు అని చెబుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ వాడే ఎల్పీజీ విషయంలో మాత్రం అలాంటి చింత అవసరం లేదని ఇతరులు చెప్పిన విషయాలను నమ్మి ఆందోళన చెందకండి అంటూ సూచిస్తున్నారు నిపుణులు.