స్టేట్ బ్యాంక్ హెచ్చరిక.. ఇది తప్పక గమనించండి..!
ఖాతాదారులు ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే దానిపై కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తూ తమ కస్టమర్లను హెచ్చరిస్తూనే ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఖాతాదారుల రక్షణ కోసం ఇప్పటికే అనేకమైన మార్పులు తీసుకువచ్చింది ఎస్బిఐ. ఇప్పటికే ఖాతాదారుల రక్షణ దృష్ట్యా నగదు విత్ డ్రా చేసుకోవడానికి ఓటీపీ తప్పనిసరి అనే నిబంధన పెట్టిన విషయం తెలిసిందే. గతంలో పరిమిత సమయం మాత్రమే ఈ సర్వీస్ అందుబాటులో ఉండగా ఇటీవల 24 గంటల పాటు ఈ సర్వీస్ ని వినియోగదారులు పొందే అవకాశం కల్పించింది.
ఇక ఇటీవల ఇంటర్నెట్ బ్యాంకింగ్ లో కూడా కీలకమైన మార్పులు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. తమ వినియోగదారులందరు సురక్షితమైన ఎలాంటి ఇబ్బందులు లేని మెరుగైన సర్వీసులు పొంది లావాదేవీలు జరిపే విధంగా తమ డొమైన్ లో మార్పులు చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వెబ్ సైట్ ను www.onlinesbi.com నుండి www.onlinesbi.sbi కి మార్పు చేసింది. స్టేట్ బ్యాంకు కస్టమర్లందరూ ఇది తప్పక గమనించాలి అంటూ తెలిపింది.