టిక్ టాక్ పై క్లారిటీ ఇచ్చిన మైక్రోసాఫ్ట్..?

praveen
మొన్నటివరకు టాప్ రేటింగ్ ఉన్న యాప్ గా దూసుకుపోయిన టిక్ టాక్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. భారత్-చైనా సరిహద్దుల్లో  నెలకొన్న ఉద్రిక్తత దృశ్య... సంచలన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వం టిక్ టాక్ ను భారత్ నుంచి నిషేధించింది. దీంతో టిక్ టాక్ కి భారీ షాక్ తగిలింది. ఇక ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అమెరికా కూడా భారత్ తరహా నిర్ణయం తీసుకుంది. తమ దేశపు భద్రత సమాచారం తస్కరణకు గురయ్యే అవకాశం ఉందనే ఆరోపణతో టిక్ టాక్ ను తమ దేశంలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది అమెరికా ప్రభుత్వం. కానీ చివరిగా ఒక్క అవకాశం మాత్రం కల్పించింది.



 ఒకవేళ అమెరికాలో టిక్ టాక్ ని  కొనసాగించాలి అంటే అమెరికాకు చెందిన సంస్థకు టిక్ టాక్ యాజమాన్య హక్కులను విక్రయించాలి అంటూ నిబంధన విధించింది. దీనికోసం ఒక డేట్ లైన్ కూడా పెట్టింది ట్రంప్ సర్కార్. అయితే ఇంకొన్ని రోజుల్లో డేట్ లైన్ ముగియనుంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ టిక్ టాక్ ను విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్ డాన్స్  తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఇక బైట్ డాన్స్  తో జరిగిన చర్చల్లో  ఏం జరిగింది అనే విషయాన్ని మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ కు  టిక్ టాక్ యాప్ యాజమాన్య హక్కులను విక్రయించేందుకు దాని మాతృసంస్థ బైట్ డాన్స్  నిరాకరించింది అంటూ తెలిపిన మైక్రోసాఫ్ట్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.



 బైట్ డాన్స్  తమ ప్రతిపాదనను అంగీకరించి ఉంటే బాగుండేది అంటూ ప్రకటనలో అభిప్రాయం వ్యక్తం చేసేది మైక్రోసాఫ్ట్. తమ కొనుగోలు  ప్రతిపాదనలు టిక్టాక్ వినియోగదారులకు శ్రేయోదాయకం గా ఉండేవి అంటూ విశ్వాసం వ్యక్తం చేసింది మైక్రోసాఫ్ట్. ఇక ప్రస్తుతం టిక్ టాక్ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే ఇంకొన్ని రోజుల్లో టిక్ టాక్ కథ సమాప్తం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్ లో  నిషేధానికి గురై పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన టిక్ టాక్ సంస్థ... ఇక అమెరికాలో కూడా నిషేధానికి గురి అయితే ఇక కనీసం సంస్థను నడపలేని స్థితిలో ఉంటుంది  దీంతో మూసివేయడం ఒకటే దారి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: