కొడాలి నాని ఈ రేంజ్ లో ఎవరినీ తిట్టలేదు.. ఇంతకీ ఏమన్నారంటే..?

Deekshitha Reddy
మంత్రి కొడాలి నాని తిట్లదండకం అందుకున్నారంటే ఆయన నోటికి ఎవరూ సాటి రారు. అలాంటి నాని వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూనే ఉన్నారు. అయితే ఆయనకు కౌంటర్లు ఇవ్వడం టీడీపీ అధినాయకులకు సాధ్యం కావడంలేదు. దీంతో కొంతమందిని ప్రోత్సహించి మరీ టీడీపీ నాయకులు తిట్టిస్తున్నారని, అలాంటి వారంతా సోషల్ మీడియాలో చేరి తనని తిడుతున్నారని, పనికి మాలిన వాళ్లంతా తనపై ఫిర్యాదులు చేస్తున్నారంటూ మండిపడ్డారు నాని.

"చంద్రబాబు చిల్లర రాజకీయం గురించి నాకు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచే తెలుసు. ఎవరైనా విమర్శలు చేస్తే సోషల్ మీడియాలో పిచ్చికుక్కలు, ఊరకుక్కల ద్వారా తిట్టించి, వర్లరామయ్యలాంటి వాళ్లకు కాగితాలు ఇచ్చి ఫిర్యాదు చేయండి అని ఉసిగొల్పుతుంటారు." అని అన్నారు నాని.

టీడీపీ అనుకూల మీడియాకి కూడా ఓ రేంజ్ లో దుమ్ము దులిపారు నాని. ఈ రాష్ట్రంలో రామోజీరావు, రాధాకృష్ణలు మాత్రమే తెలివైన వారు… మిగిలిన వారంతా పిచ్చోళ్లు… ఏం చెప్పినా వింటారు… అన్నట్టుగా వార్తలు రాస్తుంటారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. హాఫ్ నాలెడ్జ్ గాళ్లంతా వచ్చి టీవీల ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారన్నారు. ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 లాంటి చానళ్లలో అడ్డమైన కొడుకులను పెట్టి బూతులు తిట్టించడం వంటివి చంద్రబాబు చేయిస్తుంటారని… ఇవన్నీ చిన్నప్పటి నుంచే తాను చూస్తున్నానని కొడాలి నాని చెప్పారు. చంద్రబాబు తన వెంట్రుక కూడా పీకలేడన్నారు. బాబు లుచ్చా రాజకీయాలన్నీ తనకు బాగా తెలుసన్నారు నాని. బజార్లలో తిరుగుతూ రాత్రిపూట బిజినెస్‌ చేసుకునే వారిని తీసుకొచ్చి ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 మైకుల ముందు తిట్టించడాలు చేస్తుంటారని, ఇవేవీ కొత్త విషయాలు కాదన్నారు. రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.  పిచ్చి కుక్కలు, ఊర కుక్కలు అంటూ కొడాలి చేసిన విమర్శలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: