మోడీ కీలక నిర్ణయం.. త్వరలో సైన్యం లోకి..?

praveen
మోదీ సర్కారు అధికారం లోకి వచ్చినప్పటి నుంచి భారత ఆర్మీ ని మరింత పటిష్టవంతంగా శక్తివంతంగా మారుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతో బలమైన సైన్యం కలిగిన దేశంగా ఉన్న భారత్.. ఎన్నో అధునాతన టెక్నాలజీలతో కూడిన ఆయుధాలను సమకూర్చుకుంటుంది.  దీంతో  మరింత శక్తి వంతంగా మారుతుంది. భారత సైన్యాన్ని శక్తివంతం చేసేందుకు భారత ప్రభుత్వం బడ్జెట్ లో  అధిక మొత్తాన్ని కేటాయించడంతో.. ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో కూడిన శక్తివంతమైన ఆయుధాలు యుద్ధ విమానాలు  భారత అమ్ములపొదిలో వచ్చి చేరుతున్నాయి.



 అయితే ఇటీవలే రఫెల్ యుద్ధ విమానాలను  రప్పించిన విషయం తెలిసిందే. మిత్ర దేశమైన ఫ్రాన్స్ కి  రఫెల్ యుద్ధ విమానాలను ఆర్డర్ ఇచ్చిన భారత్.. ఇటీవల ఐదు యుద్ధ రఫెల్ విమానాలను భారత సైన్యం లో చేర్చింది . అయితే ఫ్రాన్స్ లో ఉన్న రఫెల్ యుద్ధ విమానాల కంటే అధునాతన టెక్నాలజీతో ఎక్కువ ఖర్చుతో ప్రత్యేకంగా భారత్ రఫెల్  యుద్ధ విమానాలను తయారు చేయించుకున్న  విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరింత అధునాతన టెక్నాలజీతో ఉండే శక్తివంతమైన యుద్ధ విమానాలను కొనేందుకు భారత ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.



 ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఎఫ్-16 యుద్ధ విమానాల కంటే శక్తివంతమైన ఎఫ్-18 యుద్ధ విమానాలను కొనేందుకు భారత్ సిద్ధమైనట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. అయితే సైన్యాన్ని మరింత పటిష్టంగా మార్చేందుకు.. భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఎఫ్-18 యుద్ధ విమానాలను  భారత ఆర్మీ లో చేర్చడం ద్వారా  భారత ఆర్మీ ఎంతో శక్తివంతంగా మారడంతో పాటు... అమెరికా తో దౌత్యపరమైన వాణిజ్యపరమైన సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉందని... అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని ఢిల్లీ సర్కిల్స్ లో  టాక్ వినిపిస్తోంది. మరీ రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: