బెజవాడ వైసిపి లోని ఈ ఇద్దరికీ ఇంకా పడట్లేదని మళ్ళీ ఋజువైందిగా..?
బెజవాడలో ఇద్దరు ఇద్దరే, ఎవరి ఫాలోయింగ్ వారికీ ఉంది. అయితే వెల్లంపల్లి మాత్రం నేను మంత్రి ని నా హవానే ఉండాలి అనుకుంటే మల్లాది మాత్రం నేను ఇక్కడ సీనియర్ ని నా హవా నే కొనసాగాలి అని అనుకుంటున్నారు. కొద్దీ రోజులుగా పార్టీ కార్యకలాపాల్లో వీరిద్దరూ ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు అనే విషయం ఇటీవలే ఓ విషయం ద్వారా తెలుస్తుంది.. విజయవాడలో సీఎం జగన్ 104, 108 వాహనాల ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ఇద్దరు నేతలకు ఆహ్వానం అందింది.
అయితే ఈ కార్యక్రంలో మల్లాది విష్ణు స్టేజి పైకి ఎక్కితే వెల్లంపల్లి కిందే ఉండిపోయారు. ఆ తర్వాత సీఎం జగన్ జోక్యంతో వెల్లంపల్లి స్టేజి మీదకి వచ్చారు.. అలాగే మల్లాది సిఫారసులు, బదిలీల లెటర్లు వస్తే ఏమాత్రం స్పందించవద్దు అని వెల్లంపల్లి తన ఆఫీస్ అధికారులకు వెల్లడించారట.. దాంతో వీరిద్దరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది.. ఇక తాజగా మంత్రి పుట్టిన రోజు ను పురస్కరించుకుని చందాలు వసూలు చేస్తున్నారని ఓ మీడియా కథనం రిలీజ్ చేయగా ప్రతిపక్షాలు దీనిపై ఏమాత్రం స్పందించలేదు కానీ సొంత పార్టీ నేత అయిన మల్లాది `మీడియాను తప్పు పట్టలేం. నిప్పులేందే పొగ వస్తుందా' అన్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీంతో వీరిద్దరి మధ్య వైరం ఇంకా పోలేదని తేటతెల్లమైంది.. దీంతో వైసీపీ కార్యకర్తలు వీరిమధ్య సంధి ఎప్పుడు నెలకొంటుందో బెజవాడ లో కొంత బలహీనంగా పార్టీ ఎప్పుడు బలపడుతుందో అని చెవులు కొరుక్కుంటున్నారు..