ఫేస్ బుక్ లో కొత్త ఫీచర్.. టిక్టాక్ తరహాలో.. మీరు గమనించారా..?
ఫేస్ బుక్ యాప్ లోనే సరికొత్తగా షార్ట్ వీడియో అనే ఫీచర్ ను తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. కాగా ఫేస్ బుక్ లో ఇప్పటికే ఈ ఫీచర్ ప్రయోగాత్మకంగా కొంత మందికి అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. న్యూస్ ఫీడ్ మధ్యలో బాక్సులో షార్ట్ వీడియోస్ కనిపిస్తాయి. ఈ ఫీచర్ ద్వారా ఫేస్ బుక్ వినియోగదారులు అందరూ... షార్ట్ వీడియోలను రూపొందించడం వీక్షించడం చేయవచ్చు. అంతేకాకుండా వాట్సాప్ ఫేస్ బుక్ స్టోరీ తరహాలోనే షార్ట్ వీడియో కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది కూడా తెలుసుకునేందుకు వీలు ఉంటుందట.
కాగా ఇప్పటికే భారత్లో టిక్ టాక్ నిషేధానికి గురైన నేపథ్యంలో.. రోపోసో, చింగారి లాంటి ఎన్నో షార్ట్ వీడియో యాప్ లు వినియోగదారులను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్న విషయం తెలిసిందే. చింగారి, రేపోసో లాంటి యాప్లను టిక్ టాక్ కి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారట నెటిజన్లు. ఇదే క్రమంలో అటు యూట్యూబ్ కూడా షార్ట్ వీడియో యాప్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫేస్ బుక్ కూడా షార్ట్ వీడియో ఫీచర్ ను ఫేస్ బుక్ లో తీసుకొచ్చేందుకు నిర్ణయించుకుందట. ఒకవేళ ఇది గనుక సక్సెస్ అయితే ఫేస్ బుక్ వినియోగదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు.