పాకిస్థాన్ పైనే జిహాద్.. ఉగ్రవాదులు యూ టర్న్...?
అయితే ఎప్పటికప్పుడు ఉగ్రవాదులు వివిధ దేశాల పై దాడులు చేస్తూ విధ్వంసాలు సృష్టిస్తూ ఉంటారు. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ వివిధ దేశాల పైకి ఉగ్రవాదుల ను రెచ్చగొట్టి ఉసిగొల్పడం చూసాం... కానీ ప్రస్తుతం పాకిస్తాన్ పైన తిరగబడేందుకు అక్కడి ఉగ్రవాద సంస్థలు సిద్ధమవుతున్నాయట . కొన్ని ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ కు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్ ప్రభుత్వం శిక్షణ ఇచ్చి తయారుచేసిన 125 మంది జైషే మహ్మద్ ఉగ్రవాది సంస్థకు చెందిన తీవ్రవాదులు .. తాలిబన్ల తో చేతులు కలిపి ఏకంగా పాకిస్తాన్ పైన జిహాదీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే పాకిస్తాన్ తయారు చేసిన ఉగ్ర సంస్థకు చెందిన తీవ్రవాదులు ప్రస్తుతం ఏకంగా పాకిస్థాన్ మీదనే పవిత్ర యుద్ధం చేస్తామంటూ ప్రకటించడం సంచలనం గా మారిపోయింది. చైనా తమ దేశానికి సంబంధించిన ఉగ్ర సంస్థలను నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుందని అలాంటి చైనా తో పాకిస్తాన్ సత్సంబందాలు కొనసాగించడాని కి వ్యతిరేకిస్తూ.. పవిత్ర యుద్ధం చేస్తున్నట్లుగా ప్రస్తుతం ఉగ్రవాద సంస్థ లు చెబుతూన్నట్లు సమాచారం. ఇది ప్రస్తుతం కొత్త సంచలనానికి తెర లేపుతోంది. మరి రానున్న రోజు ల్లో ఏం జరుగుతుంది అన్నది చూడాలి మరి,