రక్షణ కల్పిస్తున్న వారికే రక్షణ కరువు.. 9500 మంది పోలీసులకి కరోనా..?
ఆ రాష్ట్రంలో ప్రజలు రోజు రోజు దినదినగండంగా జీవితాన్ని గడుపుతున్నారు. కరోనా వైరస్ దాడి చేసి కాటికి పంపిస్తుందని భయంతోనే బతుకును వెళ్లదీస్తున్నారు. కేవలం సామాన్య ప్రజలకే కాదు అధికారులు నాయకులను సైతం ఈ మహమ్మారి కరోనా వైరస్ వదలడం లేదు. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరినీ కదిలిస్తుంది ఈ కరోనా రక్కసి . ముఖ్యంగా ప్రజలకు ధైర్యం చెబుతూ అవగాహన కల్పిస్తూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ శాఖ పై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో రోజురోజుకు మహారాష్ట్రలో కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీస్ అధికారుల సంఖ్య పెరిగిపోతుంది. అయినప్పటికి పోలీసు అధికారులు మాత్రం విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారు.
ఇప్పటివరకు మహారాష్ట్రలో 9566 మంది పోలీసు సిబ్బంది కరోనా వైరస్ బారిన పడినట్టు అధికారులు వెల్లడించగా... వీరిలో ఏకంగా 103 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 7534 మంది ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి చికిత్స తీసుకొని కోలుకోగా 1929 మంది పోలీసు అధికారులు చికిత్స తీసుకుంటున్నటు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముఖ్యంగా ముంబై-పూణే సహా ఇతర ప్రాంతాల్లో ఈ మహమ్మారి వైరస్ మరింతగా విజృంభిస్తుంది . దీంతో ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీస్ అధికారులకు సైతం కరోనా వైరస్ బారి నుంచి రక్షణ లేకుండా పోయింది.Powered by Froala Editor