ఈ లక్షణాలు మీలో ఉంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లే....?

Reddy P Rajasekhar

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే కరోనా భారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి మన మన ఇమ్యూన్ సిస్టం చాలా బలమైనది. ఇమ్యూన్ సిస్టం వల్లే మనం చాలా వ్యాధుల భారీన పడకుండా ఉంటాం. 
 
మన శరీరంలో రోగనిరోధక శక్తి బలంగా ఉన్నన్ని రోజులు ఏ సమస్య లేదు కానీ బలహీనపడితే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి బలహీనపడితే తరచూ జబ్బులతో బాధ పడాల్సి ఉంటుంది. మన జీవన శైలిని బట్టి రోగ నిరోధక శక్తి పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. అయితే చాలామందికి రోగనిరోధక శక్తి బలంగా ఉందో లేదో ఎలా తెలుసుకోవాలనే ప్రశ్న వేధిస్తూ ఉంటుంది. 
 
రోగనిరోధక శక్తి బలంగా లేని వాళ్లలో పొట్టకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తాయి. పొట్ట ఉబ్బరం, కాన్స్టిపేషన్, డయేరియా లాంటి సమస్యలు ఎక్కువగా వస్తే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నట్లే. వీళ్లలో గాయాలు త్వరగా తగ్గవు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు గాయాలు తగిలితే ఇమ్యూన్ సిస్టం అక్కడికి న్యూట్రియెంట్స్ తో నిండి ఉన్న బ్లడ్ ని పంపి త్వరగా గాయాన్ని తగ్గిస్తుంది. 
 
ఇమ్యూన్ సిస్టం వీక్ గా ఉన్నవాళ్లలో గాయం తగ్గడానికి చాలా సమయం పడుతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నవాళ్లు తరచూ దగ్గు, జలువు, శ్వాస సంబంధిత సమస్యలు, చెవినొప్పి లాంటి సమస్యలు ఉన్నవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన ఇమ్యూన్ సిస్టం లేకపోతే శరీరంలో ఓపిక కూడా ఉండదు. ఎల్లప్పుడూ నీరసంగా ఉంటే రోగనిరోధక శక్తి బలంగా లేనట్లే. రాత్రి పూట ఎనిమిది గంటలు నిద్రపోవడం, యోగా చేయడం, పండ్లూ, కూరగాయలను ఆహారంలో భాగం చేయడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, విటమిన్ సి ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: