మీడియా మంటలు: తెలుగు మీడియా రంగంలోనే ఆంధ్రజ్యోతి కొత్త ప్రయోగం..?

Chakravarthi Kalyan

కరోనా కారణంగా ప్రింట్ మీడియా ఎంత ఇబ్బందుల్లో ఇప్పటి వరకూ చాలాసార్లు చెప్పుకున్నాం.. కొన్ని పత్రికలు ఏకంగా డిజిటల్ పత్రికలుగానే మిగిలిపోతున్నాయి. చాలా పత్రికల్లో ఉద్యోగుల కోత తప్పలేదు. ఎందరో ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. గతంలో తెలుగు పత్రికలు జిల్లా టాబ్లాయిడ్ లు మెయింటైన్ చేసేవి.. ఈ కరోనా కారణంగా వాటికి గుడ్ బై చెప్పేశారు. 

 


న్యూస్ ప్రింటు, జీతాల డబ్బులు మిగుల్చుకోవడమే ఈ టాబ్లాయిడ్‌ల ఎత్తివేతకు అసలు కారణంగా చెప్పొచ్చు. అయితే మరి ఈ సంస్కరణల కారణంగా కొందరు ఉద్యోగులను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని హ్యాండిల్ చేసేందుకు ఆంధ్రజ్యోతి సంస్థ కొత్త పద్దతిని అమల్లోకి తెచ్చినట్టు తెలుస్తోంది. కరోనా వచ్చిన మొదట్లో ఆంధ్రజ్యోతి ఈ జిల్లాల సబ్‌ ఎడిటర్లను పాతిక శాతం జీతం ఇస్తాం.. మళ్లీ చెప్పేంత వరకూ డ్యూటీకి రావద్దని చెప్పింది. 

 

 


ఇక ఉద్యోగాలు ఉన్న వాళ్లకూ జీతాల్లో కోత విధించింది. ఇప్పుడు మరో కొత్త పద్దతిని అమల్లోకి తెచ్చింది. అదేంటంటే.. 25 శాతం జీతం తీసుకుంటూ మూడున్నర నెలలు ఇంటి దగ్గర ఉన్నవాళ్లను మళ్లీ పిలిచారు. ఇప్పటివరకూ పని చేస్తున్న సబ్ ఎడిటర్లను పక్కన పెట్టేశారు. వారికి నెలరోజుల సెలవులు ఇచ్చారు. అంటే వారికి 25 శాతం జీతం ఇస్తారన్నమాట. 

 


అంటే ఒక్క బ్యాచే ఎప్పుడూ నష్టపోకుండా నష్టాన్ని అందరికీ పంచుతున్నారన్నమాట. మళ్లీ నెల రోజుల తర్వాత పాత బ్యాచ్ మళ్లీ డ్యూటీలకు వస్తారన్నమాట. ఇలా నెలవారీగా షిఫ్టుల వంతున ఉద్యోగాలు చేస్తారన్నమాట. డ్యూటీ చేసిన నెల మొత్తం జీతం.. అంటే కోతపోగా వచ్చిన జీతం.. డ్యూటీ లేని నెల పాతిక శాతం జీతం అన్నమాట. ఆ విధంగా సమన్యాయం పాటిస్తూ కొత్త విధానం తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: