దారుణం : అసలు వీళ్ళు మనుషులా మృగాలా.. ఏకంగా 20 ఆవులపై ఛీ ఛీ..?

praveen

సమాజం తీరు ఎటు పోతుందో... మూగ జీవాలపై ప్రతాపం చూపిస్తూ మృగాల్లా మారిపోతున్నారు మనుషులు... కనీసం మానవత్వం మరిచి జాలి దయ లేని రాక్షసులు గా మారుతున్నారు. అడవిలో ఉండే క్రూర మృగాలు సైతం ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడుతూ ఉంటాయి... కానీ అధునాతన నాగరికతలో  జీవిస్తున్న మనుషులు మాత్రం ఆకతాయి పనుల కోసం మూగ జీవాల ప్రాణాలు తీస్తూ మృగాళ్ల మారిపోతున్నారు. మొన్నటికి మొన్న కేరళలో ఏనుగుకు.. పైనాపిల్  ఆశ చూపి అందులో బాంబు పెట్టి తినిపించడం కారణంగా గర్భంతో ఉన్న ఏనుగుని పొట్టనబెట్టుకున్న సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారి ఎంతో మంది హృదయాలను కలచివేసిన  విషయం తెలిసిందే. 

 


 ఇలాంటి ఘటనలు వరుసగా తెర మీదికి వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఒక కోతిని దారుణంగా చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టి  ఏకంగా తాడుతో ఉరి వేసిన ఘటన కూడా.. మనుషులు  ఎంత దారుణంగా మారిపోతున్నారు అనడానికి నిలువుటద్దంగా మారింది. ఇక తాజాగా ఆవులకు విషం పెట్టి చంపడం చూస్తుంటే మనుషీ  అసలు మనిషేనా అనే అనుమానం కలుగుతోంది. ఏకంగా విషం పెట్టి 20 ఆవులను దారుణంగా చంపిన ఘటన కర్ణాటక  వెలుగులోకి వచ్చింది. తోటలోకి చొరబడ్డాయి  అన్న నెపం తో ఏకంగా 20 ఆవులను పొట్టన పెట్టుకున్నారు ఇక్కడ మనుషుల రూపంలో ఉన్న రాక్షసులు.

 


 కొడగు  జిల్లాలోని ఐగురూ  ఎస్టేట్ సమీపంలో... గ్రామాల్లోని ఆవులన్ని  మేతమేస్తూ ఎస్టేట్ వరకు వచ్చేవి.. ఈ క్రమంలోనే కాఫీ తోట లోకి దూరి కాఫీ ఆకులన్నింటిని ఆవులు మేస్తున్నాయని... ఇక్కడి మేనేజర్ సహా పలువురు సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు. అరటిపండ్లలో విషం పెట్టి.. ఆవులకు కనిపించేలా పెట్టారు. అయితే అందులో విషయం ఉందని గ్రహించలేకపోయినా ఆవులు వాటిని తిని ప్రాణాలు వదిలాయి . ఈ విషయం బయటకు రాకుండా ఏకంగా ఇరవై ఆవుల మృతి దేహాలను ఎస్టేట్ లోనే  పాతిపెట్టారు. ఇక ఒక్కసారిగా ఇరవై ఆవులు కనిపించకుండా పోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఎస్టేట్ చుట్టుపక్కల వెతుకుతున్న  సందర్భంలో... దుర్వాసన వచ్చి  తవ్వి చూడగా ఆవుల కళేబరాలు బయటపడ్డాయి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: