చైనా భారత్ పై అప్పటినుంచి ఏడుస్తోందా.....?
గత కొన్ని రోజుల నుంచి చైనా భారత్ సరిహద్దు వివాదం నడుస్తోంది. డోక్లాం వివాదం నుంచి చైనా భారత్ ను దెబ్బ కొట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. గతంలోనే చైనా ఆక్సాచిన్ ను ఆక్రమించింది. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ భూభాగాల విషయంలో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటుంది. డోక్లాం అనేది భూటాన్ లో భూభాగం. భూటాన్ లో ఉన్న భూభాగం రక్షణ కోసం భారత్ సైన్యాన్ని పంపించింది.
ఈ భూభాగం రక్షణ కోసం 72 రోజులు ఆపడంతో భారత్ చైనా మధ్య వివాదం మొదలైంది. ఈ ఘటన తరువాత చైనా భారత్ ను సీరియస్ గా తీసుకుంది. ఇక అప్పటినుండి చైనా భారత్ ను సీరియస్ గా తీసుకోవడం ప్రారంభించింది. భారత్ ధైర్యంగా నిలబడటాన్ని ఇండో అమెరికన్లు సైతం సమర్థించారు. ప్రస్తుతం చైనా గల్వాన్ లోయ విషయంలో గొడవ పడిందో అప్పట్లో డోక్లాం వివాదం కూడా అలాగే చెలరేగింది.
ఆ ప్రాంతం మన దేశానికి భూటాన్ కు మధ్య ఉన్న ప్రాంతం కావడంతో డోక్లాం కూడా అలాంటి ప్రాంతమే. భూటాన్ భూభాగంతో చైనాకు ఎటువంటి సంబంధం లేదు. భూటాన్ కు భారత్ కు మధ్య రక్షణ ఒప్పందం ఉండటంతో భూటాన్ పై ఎవరైనా యుద్ధానికి వెళితే భారత్ ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. ఇరు దేశాల మద్య ఎన్నో సంవత్సరాల నుంచి ఒప్పందం ఉంది. ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయమే.
అలా ఇరుదేశాల మధ్య ఉన్న ఒప్పందం తప్పు కాదు. అప్పటినుంచి ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు దెబ్బ తిన్నా జిన్ పింగ్, మోదీ మాట్లాడుకున్నారు. చైనా కొద్దికొద్దిగా ఇతర దేశాల భూభాగాలను ఆక్రమించడం ప్రారంభించింది. కానీ కరోనా వైరస్ విజృంభణ తర్వాత చైనా దేశానికి శత్రు దేశాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.