నోయిడాలో.. ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక మెట్రో స్టేషన్..

siri Madhukar

దేవుడి సృష్టిలో కొంత మంది మనుషులు జన్యూలోపం వల్ల అటు ఆడ ఇటు మగ కాకుండా పుడున్న విషయం తెలిసిందే. వీరిని ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. గతంలో వీరిని చాలా చిన్న చూపు చూస్తుండేవారు.. కానీ కాలం మారింది.. ట్రాన్స్ జెండర్ లో కొంత మంది ఉన్నత ఉద్యోగాలు, రాజకీయాలు, సినీ రంగాల్లో కూడా ప్రవేశించారు.  ట్రాన్స్ జెండర్స్ కి ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు.. ఉపాధి పథకాలు కూడా వర్తింపజేస్తున్నారు.  అయితే కొంత మంది ట్రాన్స్ జెండర్లు తమ జీవనోపాధికి బయట తిరుగుతూ డబ్బు సంపాదించడం చూస్తున్నాం.. కొన్నిసార్లు వీరి వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

వాస్తవానికి నిజమైన ట్రాన్స్ జెండర్ అలా చేయరని.. డబ్బు సంపాదించడం కోసం ట్రాన్స్ జెండర్ల వేషం వేసుకొని ఇలాంటి దారుణాలకు పాల్పపడుతున్నారని వారు అంటున్నారు. తాజాగా దేశంలో తొలిసారి ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ మెట్రో స్టేషన్ ఏర్పాటు చేశారు. నోయిడాలోని సెక్టార్ 50 స్టేషన్‌ను వారి కోసం కేటాయించారు. ప్రత్యేక సౌకర్యాలతో ప్రయాణం చేసే వారికి, ఉద్యోగం చేసే వారికి అనుకూలమైన వాతావరణ అక్కడ ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు. దీనికి ‘రెయిన్ బో’ పేరును కూడా ఖరారు చేశారు. ట్రాన్స్ జెండర్ల సమాజం, ఎన్జీవోల నుంచి వచ్చిన సలహాల ఆధారంగా దీన్ని ఏర్పాటు చేశామని ఎండీ రీతూ మహేశ్వరి వెల్లడించారు.

ఇప్పటికే తమ సంస్థలో చాలా మందిట్రాన్స్‌జెండర్‌లకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అందుకే వారికి ప్రత్యేకంగా స్టేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇలాంటి వారికి సమాజంలో గౌరవమైన స్థానం కల్పింపజేశామని అంటున్నారు.  ట్రాన్స్ జెండర్ల సాధికారతకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు.  అంతే కాదు..  త్వరలోనే ట్రాన్స్‌జెండర్‌ స్టాఫ్‌ అందరినీ అక్కడికి బదలీ చేస్తామన్నారు. అక్కడ పూర్తి స్థాయిలో వారే పని చేస్తారని చెప్పారు. ఆ స్టేషన్‌లో ఎక్కే ట్రాన్స్‌జెండర్‌ ప్రయాణికులకు ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయని తెలిపారు. అంతకు ముందు ‘షీ మ్యాన్’గా నామకరణం చేయగా అభ్యంతరాలు రావడంతో చివరకు ‘రెయిన్‌ బో’గా మార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: