వలస కూలీలను రప్పించేందుకు సరి కొత్త ఆఫర్లు ప్రకటిస్తున్న కంపెనీలు..?

praveen

భారతదేశంలో కరోనా  వైరస్ జనజీవనాన్ని మొత్తం అతలాకుతలం చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక వలసకూలీల బ్రతుకులు దుర్భరంగా మార్చేసింది ఈ మహమ్మారి వైరస్. ఈ వైరస్ సోకి ప్రాణాలు పోవడం ఏమోకానీ... ఏకంగా వలస కూలీల కు వైరస్ తో సోకకుండానే ప్రాణాలు పోయినంత పరిస్థితి తీసుకు వచ్చింది. రాష్ట్రం  కాని రాష్ట్రం వచ్చి ఉపాధి దక్కించుకుని కూలి నాలి చేసుకుంటూ జీవనం వలస కూలీలు జీవనం సాగిస్తుంటే... కరోనా  వైరస్ కారణంగా కంపెనీలు పరిశ్రమలు మూత పడటంతో... వారి బ్రతుకు అగమ్యగోచరంగా మారిపోయింది. తినడానికి తిండిలేక పనిచేయడానికి ఉపాధిలేక కుటుంబ పోషణ భారమై... బ్రతుకు దుర్భరమై వలస కూలీల జీవితాలు అతలాకుతలమై పోయాయి. 

 


 అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం వలస కూలీలను  తమ స్వస్థలాలకు పంపిన విషయం తెలిసిందే. ఎన్నో అష్టకష్టాలు పడుకుంటూ వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్నారు. అక్కడ ఏదైనా ఉపాధి చూసుకుందాం అని ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం లాక్ డౌన్ ముగిసి అన్లాక్ ప్రారంభమైంది. ఫలితంగా వివిధ పరిశ్రమలు కంపెనీలు దుకాణ సముదాయాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీలు పరిశ్రమలకు దుకాణ సముదాయాల కు కూలీల కొరత ఏర్పడింది. అయితే అంతకు ముందు తమ దగ్గర పనిచేసిన వలసకూలీల మళ్లీ తిరిగి రప్పించేందుకు కంపెనీ పరిశ్రమల నిర్వాహకులు ఎన్నో అవస్థలు పడుతున్నారు అనే చెప్పాలి. 

 

 ఇక వలస కూలీలు ఆకర్షించేందుకు ఎన్నో విభిన్నమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు. వలస కూలీలు గ్రామాలకు వెళ్లి  గ్రామ పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ వారిని ఎలాగోలా తిరిగి రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ తిరిగి వచ్చి తమ దగ్గర పని చేస్తే వారి భద్రతకు పూర్తి భరోసా ఇవ్వడంతో పాటు... ఇక్కడికి రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని  కంపెనీల నిర్వాహకులు చెబుతున్నట్లు సమాచారం. కొన్ని కొన్ని కంపెనీలు వలస కార్మికులు తిరిగి వచ్చేందుకు బస్సు రైలు విమాన సౌకర్యాలు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: