మరోసారి కుట్రకు తెరలేపుతోన్న చైనా.... బలగాలను మోహరిస్తున్న భారత్....?

Reddy P Rajasekhar

గత 40 రోజులుగా భారత్ చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే చైనా బలగాలు వెనక్కు వెళుతున్నాయి. దీంతో భారత్ బలగాలు కూడా వెనక్కు వస్తున్నాయి. అయితే ఇక్కడే చైనా తన వంకర బుద్ధిని ప్రదర్శిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలు, కుతంత్రాలకు పెట్టింది పేరైన చైనాను నమ్మకూడదనే అభిప్రాయంతోనే భారత అధికారులు ఉన్నారు. 
 
చైనా మన దేశపు నాయకులతో గౌరవం నటిస్తుంది. మన దేశంతో స్నేహపూర్వకంగానే మెలుగుతుంది. అదే సమయంలో మన భూభాగాలనే కబ్జా చేస్తుంది. మన దేశం మీదకు పాక్ సైనికులను ఉసిగొల్పుతుంది. నేపాల్ సైనికులను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. తెరపైకి స్నేహం నటిస్తూ తెర వెనుక మాత్రం కుట్రలు, కుతంత్రాలకు తెర లేపుతూ కుక్క తోక వంకర అనే విధంగా చైనా బుద్ధిని ప్రదర్శిస్తోంది. 
 
కొన్ని రోజుల క్రితం చైనా భారత్ లోని ఏడెనిమిది ప్రాంతాలను ఆక్రమించింది. దాదాపు అన్ని ప్రాంతాలలో బలగాలు వెనక్కు వెళ్లిపోగా పాంగ్ వాన్ సరస్సు దగ్గర మాత్రం దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అక్కడ భారత్ ఎయిర్ స్ట్రిప్ నిర్మాణం ఇప్పటికే పూర్తైంది. అక్కడ చైనా బలగాలు వెనక్కు వెళ్లాల్సి ఉంది. కానీ బలగాలు మాత్రం వెనక్కు వెళ్లకపోవటానికి కారణాలు తెలియాల్సి ఉంది. చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన కీలక దళాలు ఇక్కడ ఉన్నాయని సమాచారం. 
 
దీంతో చైనాను నమ్మకూడదని భారత అధికారులు భావిస్తున్నారు. మనం సరిహద్దు ప్రాంతాల్లో అప్రమత్తం కావాలని భావించి సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కేంద్రం భారీగా బలగాలను మోహరించింది. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు చైనాపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల దృష్టి మరల్చాలనే ఉద్దేశంతో యుద్ధ వాతావరణం సృష్టించాలని చైనా ప్రయత్నించే అవకాశాలు ఉండటంతో భారత్ ముందస్తు చర్యలు చేపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: