ఇంటర్ ఫలితాల విడుదలకు తెలంగాణ సిద్దం : ఉమర్ జలీల్

Edari Rama Krishna

ఏపీలో ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఫలితాల కోసం కింద పేర్కొన్న వెబ్‌సైట్లు‌ చూడొచ్చు.  విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ విడుదల చేశారు.  ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం రద్దు అయినందున ఫస్ట్ ఇయర్ ఫలితాలను సబ్జెక్టుల వారీగా మార్కుల రూపంలో ప్రకటించారు. ఇక తెలంగాణ ఇంటర్ రిజల్ట్ కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.   గతేడాది తెలంగాణలో ఇంటర్ ఫలితాలు ఎంతటి తీవ్ర పరిణామాలు సృష్టించాయో తెలిసిందే. పలువురు విద్యార్థులు రిజల్ట్ చూసి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే.  దీనిపై అప్పట్లో పెద్ద రగడ జరిగింది. 

 

కాగా, ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు ఒకేసారి విడుదల చేయాలని తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నెలలోనే వీలయినంత త్వరగా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్ తెలిపారు.  ఈసారి అలాంటి పొరబాట్లు పునరావృతం కావని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు చెబుతోంది.

 

 

ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ మీడియాతో మాట్లాడుతూ, ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల తర్వాత ఇంటర్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఫలితాలపై రేపు సాయంత్రంలోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని, ప్రభుత్వం ఆదేశిస్తే ఈ నెల 15న ఫలితాలు విడుదల చేస్తామని వివరించారు. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని జలీల్ పేర్కొన్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: