రిజ‌ర్వ్ బ్యాంక్ తాజా నిర్ణ‌యాల‌తో సామాన్యుడికి ఒరిగేదెంత‌...?

Reddy P Rajasekhar

కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీ వల్ల వ్యాపారులకు, రైతులకు ప్రయోజనం చేకూరినా సామాన్యులు, పేదలకు ప్యాకేజీ వల్ల ఎలాంటి ప్రయోజనం కలగదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కేంద్రం ప్యాకేజీ ప్రకటన అనంతరం ఈరోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. 
 
గవర్నర్ రెపోరేటును 4.4 శాతం నుంచి 4 శాతానికి, రివర్స్ రెపో రేటును 3.35 శాతానికి తగ్గించడంతో పాటు మారటోరియంను మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు కీలక ప్రకటనలు చేశారు. ఆర్బీఐ తాజా ప్రకటనలపై సామాన్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయాల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
మారటోరియం వల్ల ఉద్యోగులకు, వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని... సామాన్యులకు అనుకూలంగా ఎలాంటి నిర్ణయాలు వెలువడలేదని చెబుతున్నారు. రెపో రేటు 4 శాతానికి తగ్గించడంతో రుణ రేట్లు తగ్గినప్పటికీ ఈ నిర్ణయం వల్ల డిపాజిట్ రేట్లపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ నిర్ణయాల వల్ల హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు బకాయిలు తీసుకున్నవారికి ప్రయోజనం చేకూరుతుందని సామాన్యులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని చెబుతున్నారు. 
 
లాక్ డౌన్ వల్ల సామాన్యులకు ఉపాధి కరువైందని... రెండు నెలలుగా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని... కేంద్రం, ఆర్బీఐ సామాన్యులకు దృష్టిలో ఉంచుకుని ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని కోరుతున్నారు. కేంద్రం, ఆర్బీఐ ప్రత్యక్షంగా సామాన్యులకు, పేదలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఆర్బీఐ తాజా నిర్ణయాల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం శూన్యమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: