అన్ని రకాల షాపులను తెరవడానికి అనుమతిచ్చిన కేంద్రం..

రెండో దశ లాక్ డౌన్ ముగియక ముందే కేంద్రం రోజుకో  మినహాయింపు ఇచ్చుకుంటూ వెళుతుంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సడలింపులు ఇవ్వగా తాజాగా అన్ని రకాల దుకాణాలను తెరవడానికి పర్మిషన్ ఇచ్చింది.  దేశ వ్యాప్తంగా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్  కింద నమోదైన దుకాణాలన్నింటినీ తెరుచుకోవొచ్చని అర్ధరాత్రి ప్రెస్ నోట్ ను విడుదలచేసింది.
 
అయితే కొన్ని నిబంధనలు కూడా విధించింది. కేంద్రం తో కలిసి నడుస్తున్న రాష్ట్రాలకే ఈమినహాయింపు  వర్తిస్తుంది. కేంద్రం తో సంబంధం లేకుండా ముందే  లాక్ డౌన్ ప్రకటించుకున్నతెలంగాణ , పంజాబ్, ఒడిశా లో  ఈ సడలింపులు లెక్కలోకి రావు. అలాగే గ్రీన్ జోన్ల కు మాత్రమే  ఈ మినహాయింపులు వర్తించనున్నాయి. రెడ్ జోన్ ,కాంటమినేట్ జోన్లలో సంపూర్ణ లాక్ డౌన్ అమలు కానుంది. అలాగే ఎలాంటి షాపింగ్ మాల్స్ తెరవడానికి అనుమతులు లేవు. 
 
ఇక తెరిచే ప్రతి షాపులో యజమానులు  సామజిక దూరం ,మాస్క్ ,శానిటైజర్ల వాడకం తప్పనిసరి చేయాల్సివుంటుంది. త్వరలోనే మరి కొన్ని మినహాయింపులు ఇవ్వడానికి కూడా కేంద్రం ప్రణాళికలు రెడీ చేస్థుందని సమాచారం. ఇక మే 3తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ముగియనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: