లాక్ డౌన్ ముగిసాక ఈ పనులు అస్సలు చేయకూడదు.. చేసారో డేంజర్ బెల్స్ మోగినట్టే..?
ప్రస్తుతం కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశ ప్రజలందరి ఇంటికే పరిమితం అయ్యేలా చేసి... కరోనా వైరస్ ఎక్కడికక్కడ కట్టడి చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. అయితే మొదట 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావం మరింత పెరగడంతో మరొకసారి లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది . అయితే అటు శాస్త్రవేత్తలు కూడా కరోనా కు మందు కనిపెట్టే పనిలో బిజీబిజీగా ఉన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ విధించింది .మే 3 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అంటే చెడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బల్లగుద్ధి చెప్పవచ్చు.
ఎందుకంటే ఇన్ని రోజుల వరకు కేవలం ఇంటికి మాత్రమే పరిమితమైన జనాలు ఇప్పుడు కనీసం టైం పాస్ కోసం అయినా రోడ్ల మీదికి చేరుతు ఎగబడుతుంటారు. దీంతో ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పడిన కష్టం విధించిన నిబంధనలు కాస్త నీటిలో పోసిన పన్నీరులా వృధా అయిపోతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే అటు ప్రజలు కూడా ఎప్పుడెప్పుడు లాక్ డౌన్ ఎత్తివేస్తారా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే లాక్ డౌన్ ఎత్తి వేసినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మనకే మంచిది అని చెబుతున్నారు నిపుణులు . ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ అందరూ పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే.
ఎలాగు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేసింది కదా అని ఎలాంటి వెకేషన్స్ ప్లాన్ చేసుకోకుండా... చాలా మటుకు ఇంటిపట్టునే ఉండేలా ప్లాన్ చేసుకోవాలి . అంతే కాకుండా తరచూ హ్యాండ్ వాష్ చేసుకోవడం మానేయకూడదు. ముఖ్యంగా లాక్ డౌన్ ఎత్తి వేశారు కదా అని మాస్కులు లేకుండా బయటకు వెళ్తే ప్రాణాలకే ప్రమాదం... అందుకే లాక్ డౌన్ లేకున్నప్పటికీ మాస్కు తప్పనిసరిగా వాడాలి. ఇక లాక్ డౌన్ లేదు కదా అని క్లబ్బులు, బార్లు లాంటి వాటికి కరోనా వైరస్ ప్రభావం తగ్గెంత వరకు దూరంగా ఉండటం మంచిది. ఇక బయట దొరికే ఫుడ్డు ని వీలైనంత వరకు తీసుకోకపోవడమే మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఎలాగో లాక్ డౌన్ ఎత్తి వేశారు కదా అని .. పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటూ ఎక్కడెక్కడినుంచో బంధువులను ఆహ్వానించి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటే మొదటికే మోసం రావటం కాయం. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో పాటించాల్సిన నియమాలు దాదాపుగా అన్ని లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా పాటిస్తే కరోనా వైరస్పై ఎప్పటికీ విజయం సాధించినట్లే అవుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు,