సీఎం జగన్.. షర్మిల అన్న చెల్లెలు బంధం ఎందరికో ఆదర్శం!

Durga Writes

తోబుట్టువు అంటే కేవలం కలిసి పెరగడం.. ప్రేమను పంచుకోవడం కాదు! కష్టసుఖాల్లో కలిసి ఉండటం. కష్టాల్లో నీ వెంట నేను ఉన్న అన్న అంటూ దైర్యం చెప్పే చెల్లెలు ఉండాలి. అలా దైర్యం చెప్పే తోబుట్టువులు మనకు ఉంటే మనం ఎదుగుతాం అని అనడంలో ఎలాంటి సందేహము లేదు. 

 

 

కష్టాల్లో.. నష్టాల్లో ఎవరో అని అనుకోకుండా వారికీ దైర్యం చెప్పడంతో తోబుట్టువులు ఎక్కడికో ఎదుగుతారు. ఇప్పుడు కూడా అలానే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆ కుటుంబం ఎన్నో కష్టాలు పడింది.. తండ్రి మరణాంతరం ఒంటరి అయ్యారు. ఆ సమయంలో సీఎం జగన్ వేసే ప్రతి అడుగుకు షర్మిల తోడు ఉంది. 

 

 

అన్న కోసం పాదయాత్రలు చేసింది.. అన్న కోసం ప్రజల వద్దకు వెళ్లి ప్రచారాలు చేసింది. మన జగన్ అన్న అంటూ 10 ఏళ్ళు అన్న కోసం కష్టపడి అన్న వెనకాల ఉండి ప్రోత్సహించింది. భార్య, తల్లితో పాటు చెల్లి ప్రోత్సాహం కలిపి అన్నను ఆంధ్ర రాష్ట్రానికి రాజును చేసింది. రాజకీయాలలో అన్నకు మించిన వారు లేరు అని నిరూపించింది. 

 

 

ఆంధ్రలో సీఎం జగన్ కు షర్మిల తోడు ఉంది ముఖ్యమంత్రిని చేసినట్టే.. తెలంగాణలోనూ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత.. కుమారుడు కేటీఆర్ ఇద్దరు ఒకరికి ఒకరు తోడు ఉంటూ తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. ఇలా మన తెలుగు రాష్ట్రాల్లో తోబుట్టువుల సహాయంతో అన్నలను రాజులను చేసిన చెల్లెల ప్రేమ చూస్తే ప్రతి అన్నకు అనిపిస్తుంది మనకు చెల్లెలు ఉండాలి అని.. నేడు అంతర్జాతీయ తోబుట్టువుల దినోత్సవం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: