కఠిన చట్టాలకు లొంగని కామాంధులు.. కరోనాకు లొంగుతున్నారు.. ఇదే ప్రూఫ్..?

praveen

మహిళలపై అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. ప్రతి చోటా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే మహిళలు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కామపు కోరల్లో చిక్కుకుంకుంటున్నారు.కామంతో  కళ్ళు మూసుకుపోయిన మృగాల్లు  ఆడపిల్లలపై అతి దారుణంగా అత్యాచారాలు చేస్తున్నారు. అయితే ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా తగ్గని అత్యాచారాలు.. కరోనా  వైరస్తో తగ్గుతున్నాయి. కరోనా  వైరస్ ఎఫెక్ట్ తో... ప్రస్తుతం చైనాలో అత్యాచారాలు కూడా తగ్గుతున్నట్లు  తెలుస్తోంది. 

 

 

 కరోనా  వైరస్ ప్రాణాలు తీయడమే కాదు మహిళల ప్రాణాలకు రక్షణ కూడా కల్పిస్తున్నట్లు ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండడం చూసి అత్యాచారం చేయబోయాడు కానీ తెలివిగా ఆలోచించిన  మహిళ చాలా తెలివిగా ఆలోచించి ఆ దొంగ అత్యాచారం చేయకుండా పారిపోయేలా చేసింది. చైనాకు చెందిన ఓ మహిళ ఇటీవలే ఊహన్  నగరం నుంచి జింగ్ షాన్  కు వచ్చి నివాసం ఉంటుంది. సదరు మహిళ ఉంటున్న ఇంట్లోకి గత శుక్రవారం ఓ దొంగ  ఇంట్లో దొంగతనం చేయడానికి ప్రవేశించాడు. అయితే ఆ దొంగ దొంగతనం చేస్తున్న సమయంలో ఆ ఇంట్లో  మహిళ ఒంటరిగా ఉందని గమనించాడు దొంగ. 

 

 

 దీంతో ఆ మహిళపై అత్యాచారం చేయబోయాడు. ఈ క్రమంలోనే తెలివిగా ఆలోచించింది మహిళా. తనకు వుహాన్ లో ఉన్నప్పుడు కరోనా  వైరస్ సోకిందని ఈ వ్యాధి నుంచి కాపాడుకోవడానికి తనను  ఇక్కడ నిర్బంధించారు అంటూ అబద్ధం చెప్పింది. అంతేకాకుండా తాను మాట్లాడుతున్న సమయంలో దగ్గుతున్నట్లు నటించింది సదరు మహిళ. దీంతో ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ఎక్కడ సోకుతుందొనని  భయాందోళనకు గురైన దొంగ ఆ మహిళపై ఎలాంటి అత్యాచారం చేయకుండానే పారిపోయాడు. ఇంట్లో ఉన్న కొంత సొమ్మును ఎత్తుకెళ్లాడు. అనంతరం ఈ విషయంపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకుని... ఆ సొమ్మును మహిళకి అప్పజెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: