బాబు కథలన్నీ అమరావతి వారికి అర్థమైపోయాయి..!!

Arun Showri Endluri
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన పార్టీల నేతల పేర్లు కంటే అమరావతి రాజధాని రైతుల పేర్లు ఎక్కువగా వినబడుతున్నాయి. అమరావతిప్రాంత రైతులు రాజధాని భూములు ఇచ్చిన వాళ్లు ఆంధ్ర రాష్ట్ర రాజధానికి మూడు రాజధానులు ఉండాలని జగన్ తీసుకున్న నిర్ణయంపై గత కొన్ని రోజుల నుండి దీక్షలు నిరసనలు చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అమరావతి రైతులతో పాటు 29 గ్రామాలలో వారికి మద్దతు తెలుపుతూ దీక్షల్లో పాల్గొంటున్నారు.

ఇటువంటి నేపథ్యంలో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు కలవడం జరిగింది. జగన్ తో అమరావతి రాజధాని రైతులు భేటీలో అసలు చంద్రబాబు హయాంలో జరిగిన భూ సేకరణ విధానాన్ని జగన్ దృష్టికితీసుకెళ్లడం జరిగింది. చాలావరకు భూసేకరణ ల్యాండ్ పులింగ్ విధానం చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని చంద్రబాబుకు అనుకూలంగా భూ సేకరణ అమరావతిలో జరిగిందని తమ భూములను కూడా బలవంతంగా లాక్కున్నారని జగన్ కి తెలియజేశారు అంట.

దీంతో అమరావతి ప్రాంతంలో ఉన్న కొంతమంది రైతులు బాబు తన హయాంలో ప్రభుత్వ విధానంలో భూసేకరణ విషయంలో మోసాలకు పాల్పడి నట్లు ఇందుమూలంగా అమరావతి ప్రాంతంలో తమని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. కావాలనే రాజకీయ లబ్ధికోసం అమరావతి ప్రాంతాన్ని రైతులను అడ్డం పెట్టుకొని బాబు డ్రామాలు ఆడుతున్నారని ఇందుమూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా జగన్ 3 రాజధానుల కు జై కొట్టిందని భావించడంతో అమరావతిలో ఉన్న రైతులు గుర్తించారట. దీంతో అమరావతిపై చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఫుల్ క్లారిటీ తో రాజధాని రైతులు ఉన్నట్లు ఏపీ రాజకీయాల్లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: