నందమూరి బాలయ్యకు మెంటలా.. ఏంటి అంత మాట అనేశాడు..?

Chakravarthi Kalyan
మరోసారి నందమూరి బాలకృష్ణ వార్తల్లోకి వచ్చాడు. ఈ హిందూపురం ఎమ్మెల్యేకు గురువారం తన సొంత నియోజక వర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. వైసీపీ నాయకులు ఆయన కాన్వాయ్ కు అడ్డుపడి నిరసన తెలిపారు. అది మీడియాలో ప్రముఖంగా రావడంతో బాలయ్య సీరియస్ అయ్యారు. ఆ ఘటనపై స్పందించారు. మౌనంగా ఉండడాన్ని తేలికగా తీసుకోవద్దని, తాను కనుసైగ చేసి ఉంటే పరిస్తితి ఏమై ఉండేదని ఆయన నిరసనకారులను ఉద్దేశించి హెచ్చరించారు.

ఏపీ రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోందని బాలయ్య విమర్శించారు. కక్షపూరిత రాజకీయాలు సరికాదని బాలకృష్ణ హితవు పలికారు. మండలి చైర్మన్ పై మంత్రుల భాష సరికాదని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం చేసిన అబివృద్ది కళ్లెదుటే కనబడుతోందని... తండ్రి వైఎస్ మండలిని తెస్తే కుమారుడు దానిని తీసివేయాలని అంటున్నారని నందమూరి బాలకృష్ణ అన్నారు.

అయితే బాలయ్య వ్యాఖ్యలు మీడియాలో ప్రముఖంగా రావడంతో వైసీపీ నాయకులు కూడా మరోసారి నోటికి పని చెప్పారు. నందమూరి బాలకృష్ణకు వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ కౌంటర్ ఇచ్చారు. సినిమాల్లోలాగా కనుసైగ చేస్తే సుమోలు లేవవనే విషయాన్ని బాలయ్య గుర్తుంచుకోవాలని సెటైర్ వేశారు. అంతేకాదు.. బాలకృష్ణ తాను కనుసైగ చేస్తే ఏమయ్యేది అనడం ఆయన మానసిక స్థితి ఎలా ఉందో తెలియజేస్తోందని ఇక్బాల్ అన్నారు.

అంటే బాలయ్యకు మెంటల్ అని ఇన్ డైరెక్టుగా చెప్పేశాడన్నమాట. గత 30 సంవత్సరాల నుంచి హిందూపురం బాలయ్య కుటుంబానికి పట్టం కడితే నియోజకవర్గ అబివృద్ధిపై దృష్టి పెట్టకుండా ప్రైవేటు కార్యక్రమలకు సంవత్సరానికి రెండు, మూడు సార్లు వచ్చిపోతున్నారని మహ్మద్ ఇక్బాల్ ధ్వజమెత్తారు. బావ చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా వాడుకుంటే బావమరిది బాలకృష్ణ హిందూపురాన్ని పేటీఎంలా వాడుకుంటున్నాడని ఇక్బాల్

మండిపడ్డారు. మొత్తానికి మరోసారి హిందూ పురం రాజకీయం రసకందాయంలో పడిందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: