ఏపీలో టాప్ 10 మంత్రులు: క‌న్న‌బాబు

Durga Writes

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా గెలుపొందిన కురసాల కన్నబాబుకు సీఎం జగన్ పెద్ద పీఠ వేశారు అనే చెప్పాలి. వ్యవసాయ శాఖకు కన్నబాబుని మంత్రిని చేశారు. తొలి మంత్రివర్గంలో కురసాల కన్నబాబు మంత్రి పదివి సాధించారు. అయితే కన్నా బాబు స్వతహగ ఒక జర్నలిస్ట్. 

 

అలాంటి జర్నలిస్ట్ హోదాలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన రాజకీయాల్లో కూడా అదే ఒరవడితో ముందుకు సాగారు. ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. జర్నలిస్ట్‌గా పనిచేసిన సమయంలో కన్నబాబుకు మెగాస్టార్‌ చిరంజీవితో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయన పెట్టిన ప్రజారాజ్యం పార్టీ వైపు అడుగులు వేసేలా చేసింది. 

 

2009 ఎన్నికల్లో కాకినాడ రూరల్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ప్రజా రాజ్యం కాంగ్రెస్‌లో విలీనమైన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రజలలో కలిసి చేసిన అభివృద్ధి ఫలితంగా 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. 

 

కాగా అనంతరం 2015 లో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.. అప్పటి నుండి సీఎం జగన్ తో కలిసి నడిచారు.. ఆలా ఓటమిలోను తోడు ఉన్న కన్నబాబు ఇప్పుడు గెలిచాక తనకు మంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్. వ్య‌వ‌సాయ మంత్రిగా ఉన్న కన్నబాబు వివాద ర‌హితుడు. అయితే, సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఆయ‌న త‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. 

 

ఎక్క‌డ ప్ర‌తిప‌క్షాన్ని ఏకేయాలో అక్క‌డ ఏకేస్తూ.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున మంచి గ‌ళం వినిపిస్తున్నారు. అంతేకాదు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసే చ్చిత్ర విచిత్ర విమర్శలపైనా తీవ్రంగా మండిపడుతూ సరైన బుద్ధి చెప్తుంటారు. ఎప్పుడు నెమ్మదస్తుడులా ఉండే మంత్రి కన్నబాబు ఒక్కసారి నోరు తెరిస్తే వారం రోజులు ఆయనపై వార్తలు వస్తాయి. అందుకే.. ఏపీలో టాప్ 10 మంత్రులలో అయన ఒకరు అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: