రాపాక పై పవన్ కళ్యాణ్ వేటు...?

Arun Showri Endluri
ఈరోజుటి కీలకమైన అసెంబ్లీ సెషన్స్ మొదలైన తర్వాత అటు పాలన కొనసాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీలను మించి జనసేన పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ పై విపరీతమైన చర్చ జరగడం గమనార్హం. ఈరోజు ఏపీ రాజధాని అభివృద్ధి గురించి ప్రవేశపెట్టిన కీలక బిల్లు కు జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక ఎలా స్పందిస్తారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరొక వైపు అసెంబ్లీ మొదలు కాకముందే జనసేన పార్టీ వారు రాపాక ను ఉద్దేశించి అసెంబ్లీలో మూడు రాజధానిలో బిల్లును వ్యతిరేకించమని నొక్కివక్కాణించారు కానీ రాపాక మాత్రం ఏ మాత్రం తన అజెండాను మార్చుకోలేదు.

మొదటినుంచి జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్న రాపాక నేడు కూడా అసెంబ్లీలో అదే పని చేశారు. జగన్ ను జనం నమ్మారు కాబట్టి అతను గెలిపించారని.. అయితే జగన్ వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు మంచి చేయడానికి కావలసింది అనుభవం కాదు ప్రజా శ్రేయస్సు కోరే తపన అని వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఏపీ 3 రాజధానుల విషయంలో జగన్ ఆలోచనలు తనకు నచ్చాయని.... మరియు తాను సంప్రదించిన కొంతమంది కూడా ఈ కాన్సెప్ట్ చాలా బాగుందని తనతో చెప్పారని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న వాడిగా తాను వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి కాబట్టి తను మూడు రోజులు విషయానికి మద్దతు తెలుపుతున్నట్లు కూడా రాపాక వెల్లడించారు.

అయితే ఇప్పుడు రాపాక తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీ వర్గాల్లో కలకలం రేపింది. అతని సంగతి తెలిసి ముందు లేఖ ద్వారా చెప్పినా కూడా రాపాక ఇటువంటి సంచలన వ్యాఖ్యలు చేయడం వెనక అతని ఉద్దేశం ఏమిటో పవన్ కళ్యాణ్ కు అర్థం కావడం లేదు. కాబట్టి పవన్ అతని పై విపరీతమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందు అతని మంగళగిరి కి పిలిచి అసలు అతని సమస్య ఏమిటో కనుక్కొని ఆ తరువాతఅతనిని పార్టీలో ఉంచాలా తీసేయాలని విషయంపై ఒక క్లారిటీ కి వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే జనసేన తనకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే ను కూడా కోల్పోవాల్సి వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: