సంక్రాంతి - ఈ సంవత్సరం సెలెబ్రెటిల సంబరాలు.... అభినందనలు

Arun Showri Endluri
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఏపీ సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి, రైతూ రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని ఆయన అన్నారు. రైతు సంక్షేమాన్ని కొనసాగిస్తామని జగన్ ఈ సందర్భంగా మాటిచ్చారు.

భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో సంక్రాంతి శోభను తీసుకువచ్చాయని– భోగి.. సంక్రాంతి.. కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి అభిలషించారు.

అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆయన కవితాత్మకంగా చేసిన ట్వీట్ పలువురిని ఆకట్టుకుంటోంది. ‘‘ఇంటి లోగిలి వద్ద రంగు రంగు ముగ్గులతో.. వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో.. మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో.. మీ ఇంటి గుమ్మం పసుపు కుంకుమలతో.. ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది, అందరూ నిత్యం సుఖ, సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు’’ అని ట్వీట్ చేశారు. 

గతేడాది ‘జెర్సీ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న నాని.. ఆ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంతో అంతగా మురిపించలేకపోయాడు. ఇక పోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సంక్రాంతి రోజున కంప్లీట్ అయింది. దీంతో ఈ చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసారు చిత్ర యూనిట్. ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్‌ అకౌంట్‌లో తెలియజేసాడు. సంక్రాంతికి ముగించాము. ఉగాదికి మొదలెడదాము అంటూ తెలుగులో ట్వీట్ చేసాడు. ‘వీ’ చిత్రం ఫుల్ లెంగ్త్ వయలెన్స్ బేస్ట్ మూవీగా దర్శకుడు ఇంద్రగంటి తెరకెక్కించడాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: