హెరాల్డ్ బర్త్ డే : భారత దేశ తొలి వ్యోమగామి జననం..?

praveen

చరిత్రలో ప్రతి రోజు ఎవరో ఒక ప్రముఖులు జన్మించే ఉంటారు. మరి జనవరి 13న నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 మెల్విన్ జోన్స్ జననం  : లయన్స్ క్లబ్ వ్యవస్థాపకుడైన మెల్విన్ జోన్స్ 1979 జనవరి 13వ తేదీన జన్మించారు. అమెరికాకు చెందిన మెల్విన్ జోన్స్  1917 అక్టోబర్లో తన మిత్రులతో కలిసి లయన్స్ క్లబ్ ను స్థాపించారు. కాగా ఈ సంస్థకు 160 దేశాల్లో  40 వేల శాఖలు ఉన్నాయి. పేద ప్రజలకు చేయూతనిస్తూ సహాయం చేయాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ ని స్థాపించబడింది  మన భారతదేశంలో కూడా ఇప్పటికీ లైన్స్ క్లబ్ ద్వారా ఎంతో మంది పేదలకు సహాయం పొందుతున్నారు.. 

 

 

 రాకేష్ శర్మ జననం : అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ. ఈయన 1949 జనవరి 13వ తేదీన జన్మించారు. 1984 ఏప్రిల్ 3 న సోవియట్ యూనియన్ కు చెందిన సోయజ్ రాకెట్ టి -11 ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగామి లతో కలిసి బైకనూర్  అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి భారత్ నుంచి వెళ్లిన తొలి వ్యోమగామి రాకేష్ శర్మ. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు వ్యోమగాములు లో ఇతను 138 వ వాడు. ఇక రోదసీ నుండి తిరిగొచ్చాక రష్యా ఇతన్ని హీరో ఆఫ్ సోవియట్ యూనియన్ అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. భారతదేశం రాకేష్ శర్మతో పాటు ఇద్దరు  రష్యన్ వ్యోమగాములను అశోక చక్ర అవార్డులతో సత్కరించింది. కాగా ప్రస్తుతం రాకేష్ శర్మ పదవీ విరమణ పొందాడు. 2006లో ఇతను ఇస్రో  ప్రముఖ శాస్త్రజ్ఞుల సమావేశంలో పాల్గొన్నాడు. 

 

 

 షియాజీ షిండే : తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ  ఇచ్చిన షియాజీ షిండే  తర్వాత ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తన అద్భుతమైన నటనతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగు లో ఎంత మంది నటులు ఉన్నప్పటికీ తనదైన డైలాగ్ డెలివరీ తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు షియాజీ షిండే. ఒక నాన్న గా,  ఒక అన్నగా,  ఒక విలన్ గా,  ఒక కమెడియన్ గా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక పేజీలు లిఖించుకున్నాడు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ టాలీవుడ్ లో కూడా శివాజీ షిండే కు మంచి గుర్తింపు ఉంది. కాగా  ఈయన 1959 జనవరి 13వ తేదీన జన్మించారు. ఇప్పటికీ షియాజీ షిండే డైలాగ్ డెలివరీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: