చంద్రబాబుకు మరో షాక్... పార్టీకి గుడ్ బై చెప్పనున్న కీలక నేత... ?

Reddy P Rajasekhar

2019 ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు బలహీనపడుతోన్న విషయం తెలిసిందే. పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారే యోచనలో ఉండగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నారు.తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత చంద్రబాబుకు షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, కీలక నేత రాయపాటి సాంబశివరావు త్వరలో చంద్రబాబుకు షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఇటీవల రాయపాటి సాంబశివరావు ఇంటిపై సీబీఐ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. సీబీఐ జరిపిన సోదాలలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. మరోవైపు రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడతారని వార్తలు వచ్చాయి. పార్టీ మార్పు గురించి , సీబీఐ సోదాల గురించి వస్తున్న వార్తలపై రాయపాటి స్పందించారు. 
 
రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ సీబీఐ వచ్చినపుడు నేను కంపెనీలో లేనని అన్నారు. సీబీఐ అధికారులు తనిఖీలు చేసి ఏమీ లేదని చెప్పి వెళ్లిపోయారని చెప్పారు. సీబీఐ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని రాయపాటి సాంబశివరావు స్పష్టత ఇచ్చారు. తన కంపెనీ వ్యవహారాలు అన్నీ సీఈవో చూసుకుంటారని రాయపాటి చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ నుండి ప్రస్తుతానికి మారే ఆలోచన లేదని కానీ మున్ముందు మారతానని రాయపాటి చెప్పారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాయపాటి సాంబశివరావు ఈ వ్యాఖ్యలు చేశారు. రాయపాటి చేసిన వ్యాఖ్యలతో త్వరలో రాయపాటి పార్టీ మారబోతున్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు రాయపాటి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రాయపాటి ఓటమిపాలయ్యారు. రాయపాటి బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నా ఒక కీలక నేత నుండి రాయపాటికి బీజేపీలో చేరటానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు తెలుస్తోంది. రాయపాటి లాంటి కీలక నేతలు పార్టీ మారితే ఇప్పటికే బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మరింత బలహీనపడటం ఖాయమని చెప్పవచ్చు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: