గ్రహణానికి, గరికెకి సంబంధం ఏంటో తెలుసా..?

praveen

గ్రహణం ఏర్పడినప్పుడు హిందువులు ఎంతో నిష్ట పాటిస్తారు అన్న విషయం తెలిసిందే. సూర్యగ్రహణం అయిన చంద్రగ్రహణం అయినా... గ్రహణం పూర్తయ్యేంతవరకు హిందువులు ఏమి ముట్టుకోరు. ఏమి వండుకోరు. గ్రహణం ఉన్నంతసేపు ఒక పీడ సమయం గా భావిస్తూ ఉంటారు. పూర్తయిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత వంటావార్పు చేసుకుంటూ ఉంటారు. అందరూ గ్రహం పూర్తయిన తర్వాతే ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలలో  ఇంట్లో గరిక వేయడం చేస్తూ ఉంటారు హిందువులు. ఇది ఇప్పటి సాంప్రదాయం కాదు... తాతల కాలం నుండి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే గ్రహణం ఏర్పడినప్పుడు ఆహార పదార్థాలలో గరికే ఎందుకు వేస్తారు అన్నది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. 

 

 

 గ్రహణం సమయంలో ఇంట్లో వంట చేయొద్దని.. ఆహారం తినొద్దు అని కనీసం మంచి నీళ్ళు కూడా తాగొద్దు అని సూచిస్తూ ఉంటారు పెద్దలు. ఇది చాలా  పురాణాల్లో కూడా ఉంది. అయితే దీనిపై భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ... రోజులు  మారుతున్న కొద్ది గ్రహణ సమయంలో పట్టింపులని  ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. గర్భిణీల విషయంలో మాత్రం ఇప్పటికీ  జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే గరికకు గ్రహణానికి సంబంధం ఏమిటంటే.. సూర్య లేదా చంద్ర గ్రహణం ఏర్పడిన రోజు... గరికను ఆహారపదార్థాల్లో ఉంచుతారు. ఇలా ఉండడానికి కారణం గ్రహణ సమయంలో భూమి మీదకి... అతి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు ప్రసరించే ప్రమాదం ఉంది. 

 

 

 అయితే గరికే  అనేది యాంటీ రేడియేషన్ గుణాలను కలిగి ఉంటుంది. అందుకే గ్రహణం సమయంలో గరికను అన్ని పాత్రల పై ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల రేడియేషన్ ప్రభావం నుంచి కొంత మేర తప్పించుకోవచ్చని ప్రజలు నమ్ముతారు.కాగా  రేపు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. ఏడాదిలో ఇది మూడవది. సూర్యుడికి చంద్రుడు అడ్డం వచ్చి  ఓ బంగారు రింగ్ ఏర్పడుతుంది. దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అంటుంటారు. రేపు 07:59 కు గ్రహణం మొదలుకానున్న సూర్యగ్రహణం  ఉదయం 10 గంటల 47 నిమిషాలకు గ్రహణం ముగుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: