పేగులు బయటకు వచ్చేలా హత్యాచారం చేస్తే.. 8 ఏళ్ళైనా న్యాయం జరగలేదు!

Durga Writes

నిర్భయ ఘటన.. ఈ ఘటన జరిగినప్పుడు నా వయసు పన్నెండేళ్లు. అప్పుడు మా తాతయ్య ఈ ఘటన చూసి చూడమ్మా ఎంత దారుణంగా అమ్మాయిని చంపేశారో.. నువ్వు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి.. బయటకు రాత్రి సమయంలో వేళ్ళకు అమ్మ అంటూ చెప్పిన రోజులు అవి. ఆరోజు నాకు ఆ మాటలు అర్థంకాలేదు.. 

కానీ ఈరోజు అర్థం అవుతుంది.. మనుషులు ఎంత దారుణం.. మన చట్టలు ఎంత దారుణం అనేది. నిజమే 12సంవత్సరాల వయసులో నాకు ఎం అర్థం కాలేదు ఇప్పుడు 20 సంవత్సరాలు.. ఇంకో పది సంవత్సరాలు పోతే 30 ఏళ్ళు.. ఇలా వయసు నా పెరుగుతుంది కానీ ఆడవారిపై అత్యాచారాలు ఆగవు.. హత్యలు ఆగవు. 

8 ఏళ్ళ క్రితం నిర్భయ ఘటన ఎలానో.. ఈరోజే అదే. ఈ 8ఏళ్లలో ఇలాంటి ఘటనలు ఎప్పుడు, ఎక్కడ జరగలేదా ? జరిగాయి కానీ నిర్భయకు, దిశకు జరిగిన ఘటనలు జరగలేదు. జరిగినప్పటికీ అవి బయటకు రాలేదు. అందుకే ఎక్కడ జరిగిన అత్యాచారాలు విచారణ పేరుతో అక్కడే ఆగిపోయాయి. 

అయితే ఈరోజు దిశ ఘటనలో అనుకోని రీతిలో న్యాయం అయితే జరిగింది. కానీ ఆ న్యాయంను కూడా ఆలా ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.. నిజమే ఆ నీచుల స్థానంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కొడుకులు, అల్లుడ్లు ఉంటె ఆ కేసులో నిందితులు చావరు అసలు కేసు ఏ బయటకు రాదు. 

ఇది జగమెరిగిన సత్యం.. కానీ ఇప్పుడు వారు కారు.. కాబట్టి వీరికి ఉరి శిక్ష పడుతుంది కనీసం అని అనుకున్నారు. అయితే నిందితులు అతి చేసి తప్పించుకోడానికి ప్రయత్నించి ఎన్కౌంటర్ కి గురై అక్కడిక్కడే మృతి చెందారు. ఏది ఏమైతేనేం.. నీచులు, కామాంధులు చచ్చారు.. అత్యంత వేగంగా దిశకు న్యాయం జరిగింది. 

మరి.. నిర్భయకు ఎప్పుడు న్యాయం. అత్యంత పాశవికంగా కదులుతున్న బస్సులో 6 మంది కలిసి ఆమె స్నేహితుడిని కొట్టి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అది కూడా అతి క్రూరంగా.. ఆమెని రాడ్ తో కొట్టి.. చంపాలపై కొట్టి అదే రాడ్ తో ఆమె కడుపులో ఉండాల్సిన పేగులను 95 శాతం పేగులను బయటకు లాగి అతి క్రూరంగా అత్యాచారం చేసి చంపారు ఆ నీచులు. 

అంతేకాదు.. అంత క్రూరంగా అత్యాచారం చేసిన ఆమెను కనీసం బట్టలు కూడా లేకుండా బస్సు నుండి ఆమె శరీరాన్ని రోడ్డు పక్కన విసిరేసి వెళ్లారు ఆ నీచులు. ఇంత చేసిన ఆ నీచులు ఒకరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోగా.. మరొకడు టీనేజేర్ అని మూడేళ్లు జైల్లో వేసి బయటకు పంపారు. 

ఇంకా మిగితా నలుగురు తీహార్ జైల్లో బీబీసీ వంటి ఛానెల్స్ చేసే డాక్యూమెంటరీస్ కి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ జైల్లో మూడుపూటలా తింటూ హాయిగా కాలాన్ని గడుపుతున్నారు. ఇది నిర్భయకు ఎనిమిదేళ్ల నుండి జరుగుతున్న న్యాయం. ఇంకెప్పుడు జరుగుతుంది న్యాయం.. ?

ఈ ఘటనను ఇంత బహిర్గతంగా రాశాను అని నన్ను తిట్టుకోకండి.. నేను కూడా మీలగే దిశ ఘటన జరిగినప్పుడు కంట్లో నీరు ఆగక ఈ ఘటన గురించి.. వరంగల్ యాసిడ్ దాడి ఘటన గురించి చదివే సమయంలో గూగుల్ లో దొరికిన జవాబులు ఇవి. అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ నిర్భయకు న్యాయం జరిగే రోజు కోసం ఎదురుచూస్తున్న మహిళను.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: