ఆరు నెల‌ల్లోనే జ‌గ‌న్‌పై ఇంత వ్య‌తిరేక‌తా... అన్నీ బాబోరి ఊహ‌లేనా...!

VUYYURU SUBHASH

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా బలపడాలి. రాజకీయంగా ఉన్న ఇబ్బందులను తట్టుకుని ఆ పార్టీ నిలబడాల్సిన అవసరం ఉంది. క్యాడర్ ని ధైర్యంగా ముందుకి నడిపించే నాయకుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో కార్యకర్తలను ప్రజల్లోకి పంపించే కార్యక్రమాలు వేగంగా చెయ్యాలి. ఇక ప్రసంగాల విషయంలో కూడా అధినేత నుంచి... ప్రతీ ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి... కాని ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని పరిణామాలు చూస్తుంటే ఇది జరుగుతున్నట్టు కనపడటం లేదనేది రాజకీయ పరిశీలకుల మాట.  

 

ప్రభుత్వ వ్యతిరేకత విషయంలో చంద్రబాబు ప్రసంగాలు ఎక్కువగా క్యాడర్ ని ఆకట్టుకుంటున్నాయి. అందులో ఎలాంటి సందేహం లేకపోయినా... అధికారంలో ఉన్నప్పుడు జరిగిన సీనే ఇప్పుడు మల్లి రిపీట్ అవుతుంది అనే అభిప్రాయం ఎక్కువగా వినపడుతుంది. అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు... అంతా బాగుంది అన్నట్టు మాట్లాడే వారు. దీనిని క్యాడర్ ఎక్కువగా నమ్మేది.

 

విపక్షం మీద చంద్రబాబు చేసిన ఆరోపణలపైనే ఎక్కువ ఆధారపడేది గాని వాస్తవాలకు మాత్రం దూరంగా ఉండేది... ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. చంద్రబాబు వ్యతిరేకత ఉందని అంటున్నారు... కాని వాస్తవాలు మాత్రం అందుకు దూరంగా ఉన్నాయి. జగన్ పాలన మీద అంత వ్యతిరేకత లేదు అనేది చాలా మంది మాట... జగన్ ఇప్పుడు జూనియర్ కాబట్టి పాలన మీద ఆయనకు పట్టు అవసరం. ఆర్ధిక వ్యవస్థ మీద కూడా పట్టు అవసరం.

 

సాగునీటి ప్రాజెక్ట్ లకు నిధులు అవసరం ఉంది, ఇసుక కొరత అనేది సాధారణ విషయం. దానిపై ప్రజల్లో తెలుగుదేశం చెప్పిన స్థాయిలో వ్యతిరేకత లేదని, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయి కాబట్టి వచ్చే ఇబ్బంది ఏమీ లేదని, జనం తమకు ఏం వస్తున్నాయని చూస్తారు గాని... రేపటి గురించి పెద్దగా ఆలోచించరని... కాబట్టి ప్రజల్లో ఎక్కడో వినపడిన నాలుగు మాటలను, చంద్రబాబు ప్రసంగాలను పట్టుకుని వ్యతిరేకత ఉన్నట్టు తెలుగుదేశం నమ్ముతుందన్న చ‌ర్చ‌లే ఎక్కువుగా విన‌ప‌డుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: