జగన్ ను ఆకాశానికి ఎత్తేసిన రమణ దీక్షితులు !

Prathap Kaluva

టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలన్నిటిని జగన్ ఇప్పడు రివర్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం టీటీడీలో తీసుకున్న అర్చకుల పదవీ విరమణ నిర్ణయాన్ని జగన్ ఇప్పుడు రద్ధు చేశారు. గత ప్రభుత్వం అర్చకులకు పదవి విరమణ నియమాన్ని అమలు చేసింది. దీనిపై చాలామంది అర్చకులు మండిపడ్డారు. ఈ నిబంధనల కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్న రమణ దీక్షితులు గారిని పదవి నుండి తొలగించారు. ఈ విషయం పై అప్పట్లో పెద్ద వివాదం జరిగింది. దీనిపై ప్రస్తుత సీఎం జగన్ ..వైసీపీ అధికారంలోకి వస్తే అర్చకులకు పదవి విరమణ అనే నియమాన్ని తీసేస్తామని చెప్పారు.ఇక అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి అర్చకుల పై కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవీ విరమణ నిబంధనను తొలగించి ..వంశపారంపర్యంగా వస్తోన్న అర్చక వృత్తిని వైఎస్ జగన్ పునరుద్ధరించారు.


దీనితో ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వం రమణ దీక్షుతులను పక్కన పెడితే ఇప్పుడు రమణ దీక్షుతులు మళ్ళీ వచ్చారు.  ఆగమ సలహాదారునిగా ఆయన బుధవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. గురువారం ఆయన తిరుమలలో శ్రీవారిని దర్శించుకోనున్నారు. పదవీ విరమణ చేసిన తరువాత రమణ దీక్షితులు శ్రీవారిని దర్శించుకోబోతుండటం ఇదే తొలిసారి కావడం విశేషం.రాజు మంచివాడైతే ప్రకృతి సహకరిస్తుందనే విషయం చరిత్రలో విన్నామని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని రమణ దీక్షితులు తెలిపారు.


ఆచార వ్యవహారాలను .. సనాతన ధర్మాలను కాపాడే పాలకుల రాజ్యం సుభిక్షంగా ఉంటుందని రమణ దీక్షితులు చెప్పుకొచ్చారు. అలాంటి పరిస్థితులే ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డాయని అన్నారు. సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. బ్రాహ్మణ సమాజానికి ఎలాంటి హామీలు ఇచ్చారో.. వాటి కంటే ఎక్కువే అమలు చేస్తున్నారని చెప్పారు.రాష్ట్రం దేశ క్షేమం కోసం దేవుళ్లకు పూజలు చేసే అర్చకుల కష్టాలను గుర్తించి వారి కోసం ఏదో చేయాలనే తపన గతంలో  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో కనిపించిందని ఇప్పుడు ఆయన కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోందని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: