వైఎస్ జగన్మోహనరెడ్డికి అధిక సంఖ్యాకుల నుండి సెగ మొదలైనట్లేనా?

ఈ రాజకీయాల కారణంగా విలువైన మానవ వనరులు నేలపాలు అవుతున్నాయి. ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి శుబ్రమన్యం బదిలీ వ్యవహారం చెప్పుకోవచ్చు. అద్భుతమైన పాలనా దక్షత ఉన్న ఒక రాష్ట్ర సర్వొన్నత పాలనాధికారిగా పనిచేసిన వ్యక్తిని అప్రధాన్య పోస్టుకు బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత ఏపీ సీఎస్‌ గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని భారత ఎన్నికల సంఘం  నియమించింది. నాడు ఆయనకు, మాజీ ముఖ్యమంత్రి నారా వారితో తిట్లు శాపనార్ధాలు బహుమతిగా లభించగా – ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి నుండి ప్రశంశలు అందుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అదే అనుబంధంతో సీఎస్‌ గా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కొనసాగించారు. అయితే అనూహ్యంగా, అంతకంటే ఎంతో అవమానకరంగా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అప్రధాన పదవిలోకి బదిలీ చేయడం గెంటేసినట్లే ఎల్వీ ఫీలయ్యారన్న భిన్నవాదనలు తెరపైకి వస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రాన్ని “రివర్స్‌” లో నడిపిస్తున్నారన్న విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు ప్రభుత్వం “మరో రివర్స్ నిర్ణయం” తీసుకుందని విమర్శలు ఉప్పెనలా వస్తున్నాయి. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి మరో అడుగు ముందుకేసి తిరుమల తిరుపతి దేవస్థానం లో బాజాప్తాగా జరుగుతున్న అన్యమత ప్రచారం అరికట్టేందుకు తీసుకున్న ఆయన తీసుకున్న చర్యలే ఎల్వీ సుబ్రహ్మణ్యం కొంప ముంచాయా? అందుకే బదిలీ చేశారా? అనే ప్రశ్నలు సంధించడంతో బదిలీ వ్యవహారం కాస్తా రాజకీయ రంగే కాదు మతవర్ణం పులుముకుంది.

దీన్ని ఋజువుపరుస్తూ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ పై క్రిస్టియన్లు వారి సంఘాలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు, చర్చీల్లో కేక్-కట్ చేసి మరీ సంబరాలు చేసుకుంటున్న ఫొటోలు సోషల్ మీడియా లో పరంపరగా దర్శనమిచ్చాయి. ఏళ్ల తరబడి దేవదాయ శాఖలో పనిచేస్తున్న దళితులను సామూహికంగా ఉద్యోగాల నుంచి తొలగించిన ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేయడం పై హర్షద్వనాలు  వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటనలు కూడా విడుదల చేశాయి.

ఇదిలా ఉంటే మరోవైపు ఎల్వీ సుబ్రమణ్యానికి మద్దతుగా ఉభయ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేక్షంగా గళమెత్తుతున్నాయి. 
ప్రముఖంగా చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టారు. అకారణంగా ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్ బాధ్యతల నుంచి తప్పించడం వెదనాభరితం అన్నారు. ఒక సీఎస్ పట్ల అదీ తనకు ఎన్నికలవేళ నాటి ప్రభుత్వ దుష్ప్రభావం జగన్ పై పడకుండా చట్టపరంగా అడ్డు నిలబడి కాపాడిన వ్యక్తిపై ఇలా వ్యవహరించడం వైఎస్ జగన్మోహనరెడ్డికి సరికాదని వ్యాఖ్యానించారు. దీనికి కారణం జగన్ క్రిష్టియన్ కావటమే అనే మాట బలంగా వినిపిస్తుంది 

“క్రిస్టియన్ మిషనరీ మాఫియా” తెచ్చిన తీవ్ర ఒత్తిడి తోనే ఎల్వీ సుబ్రమన్యాన్ని బదిలీ చేశారన్న వదంతులు ముఖ్యంగా హిందూ వర్గాల మనసుల్లో నిక్షిప్తం ఇప్పటికే అయ్యాయని, అది వ్యాప్తి చెందుతున్నాయని, బదిలీకి గల నిజమైన కారణాలను ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి వెల్లడించాలని ప్రజలకు తనే బహిరంగంగా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల పరిరక్షణకు ఎల్వీ సుబ్రమణ్యం కృషి చేశారని కొనియాడారు. టిడిపిలో అన్యాయానికి గురైన దరిమిలా న్యాయం జరుగు తుందన్న నమ్మకంతో బ్రాహ్మణులు వైసీపీకి ఓట్లేసి అండగా నిలిచారని, కానీ తమ వర్గానికి చెందిన అధికారికి అన్యాయం జరగడం బాధాకరమని బ్రాహ్మణ  సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 

గత నాలుగు రోజులుగా ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు హిందువులను అభద్రతా భావానికి గురిచేస్తున్నాయన్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపం జరిగినప్పుడు ఇద్దరినీ కలిపి అవసరమైతే మందలించి ఈ వ్యవహారాన్ని సరిదిద్దేలా ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి – తక్కువ స్థాయి అధికారితో అత్యంత సీనియర్ మరియు ఐదారు నెలల్లో రిటైర్ అవ్వనున్న సీఎస్ ఎల్వి సుబ్రమన్యానికి మనోవేదన కలిగించేలా ప్రవర్తించటం – ఆయన పతనం వైపుకే నడుస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో  పునరాలోచన చేయాలని కోరుతున్నామని ప్రకటన విడుదల చేశారు. 

క్రిస్టియన్ &  బ్రాహ్మణ సంఘాల ఎంట్రీతో ఈ విషయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద రెచ్చి పోయే క్రిష్టియన్ సంఘాలను అధిక సంఖ్యాక  హిందువులపై పెట్రేగి పోయెలా చేయటంతో – జగన్మొహనరెడ్డికి రానున్న ఎన్నికల్లో నేటి చంద్రబాబు నాయుడికి పట్టిన దుర్గతే పడుతుందని విశ్లేషకుల అభిప్రాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: